న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రన్ మెషీన్ రజత్: మే 25..ఐపీఎల్ ఎలిమినేట్‌లో సెంచరీ: జూన్ 25..రంజీ ఫైనల్‌లో మళ్లీ వంద

Ranji Trophy Final 2002 Day 4: Rajat Patidar cracks a hundred just a month after an IPL century

బెంగళూరు: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై-మధ్య ప్రదేశ్ మధ్య రంజీ కొనసాగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో వరుస సెంచరీలు నమోదవుతున్నాయి. ముంబైకి ధీటుగా సత్తా చాటుతోంది మధ్య ప్రదేశ్. ఇప్పటికే భారీ స్కోర్ చేసింది. ఆరు వికెట్ల నష్టానికి 457 పరుగులు సాధించింది. ముంబైపై 83 పరుగుల ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. నాలుగో రోజు గేమ్‌లో మధ్యప్రదేశ్ ప్లేయర్ రజత్ పటిదార్ సెంచరీ కొట్టడం హైలైట్.

374 పరుగులకు ముంబై ఆలౌట్..

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. తొలి ఇన్నింగ్‌లో 374 పరుగులకు ఆలౌట్ అయింది. కేప్టెన్ పృథ్వీ షా-47, యశస్వి జైస్వాల్-78, అర్మాన్ జాఫర్-26, సువేద్ పార్కర్-18, సర్ఫరాజ్ ఖాన్-134, హార్దిక్ తమోరె-24, షామ్స్ ములాని-12, తనుష్ కొటియాన్-15, ధవల్ కులకర్ణి-1, తుషార్ దేశ్‌పాండే-6 చేశారు. మోహిత్ అవస్థి-7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మధ్యప్రదేశ్ బౌలర్లు అనుభవ్ అగర్వాల్-3 వికెట్లు తీసుకున్నాడు. సారాంశ్ జైన్-2, గౌరవ్ యాదవ్-4, కుమార్ కార్తికేయ ఒక వికెట్ పడగొట్టారు.

సత్తాచాటుతున్న మధ్యప్రదేశ్..

సత్తాచాటుతున్న మధ్యప్రదేశ్..

తొలి ఇన్నింగ్ ఆరంభించిన మధ్యప్రదేశ్.. ముంబైకి ధీటుగా రాణిస్తోంది. మధ్యప్రదేశ్ ఇన్నింగ్‌లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. ఓపెనర్ యశ్ దుబే 122 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. వన్ డౌన్ బ్యాటర్ శుభం శర్మ 116 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ హిమాంశు మంత్రి 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని తరువాత క్రీజ్‌లోకి వచ్చిన శుభం శర్మ భారీ షాట్లతో చెలరేగాడు. ఒక సిక్సర్, 15 ఫోర్లతో 116 పరుగులు చేశాడు. అవస్థి బౌలింగ్‌లో వికెట్ కీపర్ తమోరెకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

చెలరేగిన రజత్..

అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రజత్ పటిదార్ కూడా క్రీజ్‌లో పాతుకు పోయాడు. సెంచరీ సాధించాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్‌లో ఇది మూడో సెంచరీ. ఈ రెండు రోజుల్లోనే మూడు సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ 2022 సీజన్‌లో రజత్ పటిదార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన విషయం తెలిసిందే. కిందటి నెల 25వ తేదీన కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై జరిగిన తొలి ఎలిమినేటర్‌లో రజత్ పటిదార్ సెంచరీ కొట్టాడు. సరిగ్గా నెల రోజుల తరువాత ఇప్పుడు మళ్లీ అదే తేదీకి రంజీ ఫైనల్‌లో మళ్లీ వంద బాదాడు.

రన్ మెషీన్.. రజత్

రజత్ పటిదార్ ఫుల్ ఫామ్‌లో ఉంటోన్నాడు. ఈ సీజన్‌లో అతినికి ఇది రెండో సెంచరీ. గుజరాత్‌పై రెండు ఇన్నింగ్స్‌లో 54, 53 పరుగులు చేశాడు. మేఘాలయపై 86, కేరళపై 142, రంజీ క్వార్టర్ ఫైనల్స్‌లో పంజాబ్‌పై 85 పరుగులు చేశాడు. బెంగాల్ జట్టుపై రంజీ సెమీ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌లో 7, 79 పరుగులను నమోదు చేశాడు. ఇప్పుడు ఫైనల్‌లో ముంబైపై మరోసారి పంజా విసిరాడు. సెంచరీ అందుకున్నాడు.

ప్రభావం చూపని ముంబై బౌలర్లు..

ప్రభావం చూపని ముంబై బౌలర్లు..

ముంబై బౌలర్లు ఏ మాత్రం రాణించలేకపోతున్నారు. ధవల్ కులకర్ణి, తనుష్ కొటియాన్ వికెట్లను పడగొట్టలేకపోతున్నారు. వికెట్ లెస్‌గా మారారు. తుషార్ దేశ్‌పాండే, షామ్స్ ములాని, మోహిత్ అవస్తి రెండు వికెట్ల చొప్పున తీసుకున్నారు. అంతకుముందు ముంబై ఇన్నింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 134 పరుగులు చేసి, గౌరవ్ యాదవ్ బౌలింగ్‌లో శ్రీవాస్తవకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Story first published: Saturday, June 25, 2022, 11:57 [IST]
Other articles published on Jun 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X