44 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టిన బీహార్ స్పిన్నర్

Ranji Trophy: Bihar spinner Ashutosh Aman breaks Bishan Bedi’s 44-year old record

హైదరాబాద్: బీహార్ ఎడమి చేతివాటం స్పిన్నర్ అశుతోష్ అమాన్ చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మాజీ స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ రికార్డుని అధిగమించాడు. 1974-75 రంజీ సీజన్‌లో ఢిల్లీ తరుపున బిషన్ సింగ్ బేడీ 64 వికెట్లు తీశాడు.

అయితే, ప్రస్తుత రంజీ సీజన్‌లో బీహార్ స్పిన్నర్ అశుతోష్ అమాన్ 65 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. 32 ఏళ్ల అశుతోష్ అమాన్ మణిపూర్‌ బ్యాట్స్‌మన్ సగప్తమ్ సింగ్‌ను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మణిపూర్‌పై బీహార్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అయిన అశుతోష్ అమాన్ మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 7/71 గణాంకాలను నమోదు చేశాడు. ఈ సీజన్‌లో మొత్తం 14 ఇన్నింగ్స్‌లాడిన అశుతోష్ 6.48 యావరేజితో 68 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మణిపూర్ జట్టుకు 116 పరుగుల ఆధిక్యం లభించింది.

చివరిరోజు ఓవర్ నైట్ స్కోరు 217/7తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మణిపూర్ 238 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం బీహార్ ఖాతాలో 6 పాయింట్లు ఉండగా, మణిపూర్ పాయింట్ల ఖాతా తెరవలేదు. ప్రస్తుతం ప్లేట్ గ్రూపు నుంచి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఏకైక జట్టుగా ఉత్తరాఖండ్ నిలిచింది.

సంక్షిప్త స్కోర్లు:
డెహ్రాడూన్: Uttarakhand 377. Mizoram 198 and following-on123; 59 overs (Taruwar Kohli 68; Rajat Bhatia 4/17, Mayank Mishra 3/29). Uttarakhand won by an innings and 56 runs. Points: Uttarakhand 7, Mizoram 0.

దింపూర్:
Nagaland 467 and 185/5; 55 overs (HH Zhimomi 49 batting, Arbar Kazi 42 batting). Puducherry 286; 98.2 overs (Paras Dogra 144, Sai Karthik 81; Arbar Kazi 4/62, Imliwati Lemtur 3/57). In Goalpara: Arunachal Pradesh 169 and 109; 45.3 overs (Kshitiz Sharma 31, Techi Neri 23 not out; Ishwar Chaudhary 7/51). Sikkim 262 and 19 for no loss; 1.3 overs. Sikkim won by 10 wickets. Points: Sikkim 7, Arunchal Pradesh 0.

పాట్నా:
Manipur 156 and 238; 70.4 overs (Yashpal Singh 105, Priyojit Singh 64; Ashutosh Aman 7/71, Samar Quadri 3/93). Bihar 257 and 140/7; 25.1 overs (Mangal Mehrur 53, Vikash Ranjan 39, Ashutosh Aman 22 not out). Bihar won by three wickets. Points: Bihar 6. Manipur 0.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Thursday, January 10, 2019, 13:43 [IST]
  Other articles published on Jan 10, 2019
  POLLS

  Get breaking news alerts from myKhel

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more