న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా కోచ్‌గా రమేశ్ పవార్‌ను నియమించిన బీసీసీఐ

Ramesh Powar appointed womens cricket team coach

హైదరాబాద్: ఎట్టకేలకు బీసీసీఐ కీలక నిర్ణయాన్ని ప్రకటించి భారత మహిళ జట్టు కోచ్ విషయానికి తెరదించింది. జూలై నెల నుంచి ఆ జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తోన్న రమేశ్ పవార్‌నే నవంబరు 2018వరకూ పూర్తి స్థాయి ప్రధాన కోచ్‌గా నియమిస్తూ ప్రకటన జారీ చేసింది. సెప్టెంబరు నెలలో జరగనున్న శ్రీలంక పర్యటన.. నవంబరు నెలలో వెస్టిండీస్‌ వేదికగా ఐసీసీ వరల్డ్ ఉమెన్స్ వరల్డ్ టీ20కు రమేశ్ పవార్ కోచ్‌గా మహిళా జట్టు ఆడనుంది.

కొద్ది కాలం క్రితం భారత్‌ మహిళల జట్టు కోచ్‌ తుషార్‌ ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీనియర్‌ క్రీడాకారిణులు కోచ్‌ పద్ధతి సరిగా లేదంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో తుషార్‌ రాజీనామా చేశారు. దీంతో మహిళల జట్టుకు తాత్కాలిక కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌ రమేశ్‌ పవార్‌ను ఎంచుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జులై 25 నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో మిథాలీ సేన శిక్షణ మొదలుపెట్టినప్పటి నుంచి రమేశ్‌ జట్టుతో కలవనున్నాడు.

టీమిండియా కోచ్‌గా కోహ్లీ గురువే రానున్నాడా..?టీమిండియా కోచ్‌గా కోహ్లీ గురువే రానున్నాడా..?

'బీసీసీఐ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు నాకు అప్పగించింది. ఎంతో సంతోషంగా ఉంది. భారత జట్టు మంచి విజయాలు సాధించేలా కృషి చేస్తా' అని పవార్‌ తెలిపారు. అయితే నవంబరు తర్వాత మళ్లీ కోచ్ మారనున్న నేపథ్యంలో ఇంకో కోచ్ కోసం జరిగిన వేట కేవలం వాయిదా పడిందంతే.

భారత మహిళ జట్టు కోచ్‌గా ఎంపికైన రమేశ్‌ పవార్‌ భారత్‌ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడారు. కాగా, 'సీనియర్ క్రీడాకారులైన మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలు బాగానే సహకరించారు. హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే నాపై ఫిర్యాదులు చేసింది. కేవలం ఒక పక్కనే వాదన వినడం సరికాదని, క్రీడాకారిణుల ప్రవర్తన సరిగా లేద'ని తుషార్ పదవీ విరమణ చేసేముందు ఆవేదన వ్యక్తం చేశాడు.

Story first published: Tuesday, August 14, 2018, 17:12 [IST]
Other articles published on Aug 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X