న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిథాలీతో వివాదం: ఇండియా-ఏ బౌలింగ్ కోచ్‌గా రమేశ్ పొవార్

Ramesh Powar appointed India As bowling coach

హైదరాబాద్: టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పొవార్‌‌ను బీసీసీఐ భారత-ఏ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమించింది. గతంలో భారత మహిళల జట్టుకు నాలుగు నెలలు పాటు హెడ్ కోచ్‌గా రమేశ్ పొవార్ పనిచేశారు. ఆ సమయంలో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

నెటిజన్ ప్రశ్న: అలియా భట్ ఎవరో తెలియదన్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్నెటిజన్ ప్రశ్న: అలియా భట్ ఎవరో తెలియదన్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

మహిళల వరల్డ్‌కప్‌లో కీలకమైన సెమీ ఫైనల్‌ నుంచి మిథాలీ రాజ్‌ని తప్పించడంతో అప్పట్లో పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ పాలకుల కమిటీ ముందు హాజరైన మిథాలీ రాజ్ తనను జట్టు నుంచి తప్పించడానికి కోచ్ పవారే కారణమని వెల్లడించింది. దీంతో కోచ్‌గా పవార్ పదవీ కాలాన్ని పొడించేందుకు బీసీసీఐ అంగీకరించలేదు.

ఆ తర్వాత భారత మహిళా జట్టు కోచ్‌ పదవికి బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించగా, పొవార్‌ సైతం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, డబ్యూ వీ రామన్‌ను బీసీసీఐ కోచ్‌గా ఎంపిక చేయడంతో పొవార్‌కు నిరాశే ఎదురైంది. అనంతరం భారత అండర్‌-19 జట్లకు సంబంధించిన కార్యక్రమాలకు పవార్‌ హాజరవుతున్నాడు.

ఈ నేపథ్యంలో భారత-ఏ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక కావడానికి మార్గం సుగమం అయ్యింది. 41 ఏళ్ల పొవార్‌ను ఇటీవలే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన కోచింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌కు బీసీసీఐ ఆహ్వానించింది. ఈ క్రమంలో అతడిని భారత-ఏ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది.

అఫీసియల్: అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మారనున్న ఫిరోజ్ షా కోట్లా అఫీసియల్: అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మారనున్న ఫిరోజ్ షా కోట్లా

టీమిండియా తరుపున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడిన పొవార్ దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో స్వదేశంలో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో మాత్రమే బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. దక్షిణాఫ్రికా-ఏ జట్టు భారత పర్యటనలో భాగంగా ఐదు వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లను ఆడనుంది.

Story first published: Tuesday, August 27, 2019, 18:09 [IST]
Other articles published on Aug 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X