న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంక క్రికెటర్ అరెస్టు, తప్ప తాగి దాడికి పాల్పడటంతో...

Rambukwella arrested on assault and drunk driving charges

హైదరాబాద్: క్రికెటర్లు మైదానాల్లోనే కాదు బయట కూడా హీరోలమనుకుంటూ ప్రవర్తించి లీగల్ శిక్షలకు కారణమవుతున్నారు. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ క్లబ్బులో తాగి కొందరితో దురుసుగా ప్రవర్తించడంతో ఇలానే శిక్షకు గురై కోర్టుల చుట్టూ తిరిగాడు. ఇప్పుడు అదే విధమైన కష్టాలు తప్పలేదు లంక క్రికెటర్‌కి. ఫుల్లుగా తాగేసి కారు నడపడమే కాకుండా ఇద్దరు యూనివర్శిటీ విద్యార్థులపై దాడికి పాల్పడిన శ్రీలంక క్రికెటర్‌ రమిత్‌ రామ్‌బుక్వెల్లాను శ్రీలంక పోలీసులు అరెస్ట్‌ చేశారు.

విద్యార్థులపై దాడి చేసిన తర్వాత కొలంబోని నవాలా రహదారిపై వెళుతున్న సమయంలో రమిత్‌ను అరెస్ట్‌ చేసిన విషయాన్ని పోలీసులు తెలిపారు. అతన్ని అలుత్‌కేడ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీస్‌ అధికారి పేర్కొన్నారు. రమిత్‌ తాజా వ్యవహారంపై శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.

రమిత్‌పై చర్యలు తీసుకుంటామని లంక బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రధానంగా శ్రీలంక క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితాలో రమిత్‌ చోటు కోల్పోయే అవకాశం ఉంది. రెండేళ్ల క‍్రితం ఒకసారి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఒకసారి అరెస్టైన రమిత్‌..తాజాగా మరో వివాదానికి కారణమయ్యాడు.

2013లో శ్రీలంక జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన రమిత్‌.. 2016 జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిసారి కనిపించాడు. శ్రీలంక తరపును రెండు టీ 20ల్లో మాత్రమే రమిత్‌ ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Sunday, March 11, 2018, 15:31 [IST]
Other articles published on Mar 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X