న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ డ్రా: రోజంతా ఆడారు, న్యూజిలాండ్ చరిత్రలోనే ఇది మొదటిసారి

Rain helps Sri Lanka claim draw against New Zealand

హైదరాబాద్: వెల్లింగ్టన్‌ వేదికగా శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజైన బుధవారం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం ఎంతకీ తెరపనివ్వకపోవడంతో అంఫైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఐద రోజు కేవలం 53 నిమిషాల ఆట మాత్రమే సాధ్యమైంది.

ఐపీఎల్‌లో మరో తెలుగు తేజం: ఎవరీ బండారు అయ్యప్పఐపీఎల్‌లో మరో తెలుగు తేజం: ఎవరీ బండారు అయ్యప్ప

కాగా, నాలుగో రోజు ఆటలో భాగంగా కుశాల్‌ మెండిస్‌ (287 బంతుల్లో 116 బ్యాటింగ్‌; 12 ఫోర్లు), మాథ్యూస్‌ (293 బంతుల్లో 117 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) అద్భుతమైన బ్యాటింగ్‌ను ఔరా అనిపించారు. ఈ టెస్టులో పర్యాటక శ్రీలంక జట్టు ఘోరంగా ఓడుతుందనుకున్న సమయంలో వీరిద్దరూ అజేయ సెంచరీలతో మెరిశారు.

పదేళ్ల తర్వాత ఓ అద్భుతమైన రికార్డు

ఈ క్రమంలో శ్రీలంక జట్టు పదేళ్ల తర్వాత ఓ అద్భుతమైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. వికెట్‌ ఇవ్వకుండా నాలుగో రోజంతా బ్యాటింగ్‌ చేశారు. 2008లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు వికెట్‌ కోల్పోకుండా రోజంతా బ్యాటింగ్‌ చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఘనత సాధ్యమైంది.

రోజంతా ఆడినా న్యూజిలాండ్‌‌కు వికెట్ లభించలేదు

రోజంతా ఆడినా న్యూజిలాండ్‌‌కు వికెట్ లభించలేదు

మరోవైపు సొంత గడ్డపై రోజంతా ఆడినా న్యూజిలాండ్‌ ఒక్క వికెటైనా తీయలేకపోవడం ఇదే మొదటిసారి. మొత్తం టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇలా వికెట్‌ లేకుండా రోజు ముగియడం 22వ సారి కావడం విశేషం. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.

 37 పరుగుల వెనుకంజలో శ్రీలంక

37 పరుగుల వెనుకంజలో శ్రీలంక

కేవలం 37 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 296 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్‌ పరాజయంతో నాలుగో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 20/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన శ్రీలంక జట్టులో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మెండిస్, మాథ్యూస్‌ రోజంతా క్రీజులో పాతుకుపోయారు.

మూడు సెషన్లు మొత్తం ఆడిన లంక బ్యాట్స్‌మెన్

మూడు సెషన్లు మొత్తం ఆడిన లంక బ్యాట్స్‌మెన్

ఇద్దరూ నిలకడగా ఆడుతూ మూడు సెషన్లు మొత్తం ఆడారు. మూడో సెషన్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే కుశాల్ మెండిస్‌ సెంచరీ సాధించగా, ఆ తర్వాత ఏంజెలో మ్యాథ్యూస్ సైతం సెంచరీతో అజేయంగా నిలిచారు. వీళ్లిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 246 పరుగులు జోడించారు.

1
44074
Story first published: Wednesday, December 19, 2018, 19:29 [IST]
Other articles published on Dec 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X