న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs KXIP: సిక్సులు బాదగలనని తెలుసు.. కానీ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం అద్భుతమే: తెవాటియా

Rahul Tewatia says Five sixes in an over is amazing

షార్జా: ఒక్క సిక్సర్‌తో మ్యాచ్ గమనం మారిపోతుందని తనకు ముందే తెలుసని రాజస్థాన్‌ రాయల్స్ హిట్టర్‌ రాహుల్‌ తెవాటియా అన్నాడు. సిక్సులు బాదగలనని తెలుసని, కానీ ఒకే ఓవర్‌లో తాను ఐదు సిక్సర్లు బాదడం అద్భుతమని పేర్కొన్నాడు. రాజస్థాన్ ఆటగాడు రాహుల్ తెవాటియా అద్భుతం చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సులు బాది (53; 31 బంతుల్లో 7×6) మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.

మ్యాచ్ అనంతరం రాహుల్‌ తెవాటియా మాట్లాడుతూ... 'నేను సిక్సులు కొట్టగలనని డగౌట్‌లోని వారికి తెలుసు. నన్ను నేను నమ్మాలని భావించా. ఒక్క సిక్సర్‌ కొడితే అంతా మారిపోతుంది. అయితే ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం మాత్రం అద్భుతమే. లెగ్‌ స్పిన్‌లో షాట్లు ఆడేందుకు ప్రయత్నించా. కానీ కుదర్లేదు. అందుకే మిగతా బౌలర్ల బౌలింగ్‌లో బాగా ఆడాను. మొదట 20 బంతుల్లో ఆడినట్టు ఎప్పుడూ ఆడలేదు. ఆ తర్వాత బాదడం షురూ చేశాను. అని చెప్పాడు. లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో సిక్సులు కొట్టమని కోచ్ నన్ను పంపాడు కానీ నేను అలా చేయలేదన్నాడు.

స్టీవ్ స్మిత్ (50; 27 బంతుల్లో 7×4 2×6) ఔటైనా.. సంజూ శాంసన్ (85; 42 బంతుల్లో 4×4, 7×6) రాజస్థాన్‌ను విజయం దిశగా నడిపాడు. కానీ మొహమ్మద్ షమీ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు. అప్పటికి రాజస్థాన్ స్కోరు 161 మాత్రమే. అప్పటికి 21 బంతుల్లో 14 రన్స్ మాత్రమే తెవాటియా చేసింది. రాజస్థాన్ విజయానికి 23 బంతుల్లో 63 పరుగులు కావాలి. దీంతో రాజస్థాన్ ఓడిపోతుందని భావించారంతా. రాబిన్ ఉతప్ప రెండు ఫోర్లు బాదడంతో.. రాజస్థాన్ విజయానికి 18 బంతుల్లో 51 రన్స్ అవసరమయ్యాయి.

రాజస్థాన్‌ విజయానికి 3 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సిన స్థితిలో తెవాటియా అనూహ్యంగా చెలరేగిపోయాడు. అప్పటి వరకు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన తెవాటియా.. షెల్డన్‌ కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్‌లో మొత్తం 5 సిక్సులు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ ఓవర్లో 30 రన్స్ వచ్చాయి. దీంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. రాయల్స్‌ సునాయాస విజయాన్ని అందుకుంది. మొదటి 19 బంతుల్లో 8 రన్స్ చేసిన తెవాటియా .. చివరి 12 బంతుల్లో 45 రన్స్ చేశాడు.

RR vs KXIP: బంతిని బలంగా బాదడం నా జీన్స్‌లోనే ఉంది.. మా నాన్న ఫవర్‌ఫుల్ మ్యాన్: శాంసన్‌RR vs KXIP: బంతిని బలంగా బాదడం నా జీన్స్‌లోనే ఉంది.. మా నాన్న ఫవర్‌ఫుల్ మ్యాన్: శాంసన్‌

Story first published: Monday, September 28, 2020, 14:31 [IST]
Other articles published on Sep 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X