న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పర్యటనకు ముందు వార్మప్ మ్యాచ్‌లు తప్పనిసరి: ద్రవిడ్

Rahul Dravid wants Virat Kohli & Co to play warm-up games before overseas series

న్యూ ఢిల్లీ: వార్మప్‌ మ్యాచ్‌ల్లో నాణ్యమైన బౌలర్లు ఉండరు కాబట్టి వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కోహ్లి పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ద్రవిడ్‌ స్పందించాడు. విదేశాల్లో సిరీస్‌లు ఆడే ముందు వార్మప్‌ మ్యాచ్‌లు కచ్చితంగా ఆడాలని రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ పర్యటనలకు ముందు టీమ్‌ఇండియా చాలినన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడకపోవడంపై విమర్శలు వచ్చాయి.

పర్యటన ముందు 2 వార్మప్‌ మ్యాచ్‌లు

పర్యటన ముందు 2 వార్మప్‌ మ్యాచ్‌లు

‘నేను ఎక్కువ సంఖ్యలో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడటం వల్ల ఎంతో ప్రయోజనం పొందా. ఐతే ఇప్పుడు షెడ్యూల్లు మారిపోయాయి. పరిస్థితులు కఠినతరంగా మారాయి. అయినప్పటికీ ఏ విదేశీ పర్యటనకు ముందు అయినా రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడటం కచ్చితంగా మేలు చేస్తుంది'అని అతనన్నాడు. భారత క్రికెటర్లు మామూలుగానే టెస్టు క్రికెట్‌ కోసం సాధన చేయడం తగ్గిపోతోందని ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు.

దశల వారీగా సాధించేందుకు

దశల వారీగా సాధించేందుకు

ప్రస్తుతం అండర్ 19.. భారత్ ఏ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తోన్న ద్రవిడ్‌ను జట్ల పురోగతి గురించి ప్రశ్నించగా.. 'క్రమంగా మెరుగుపడుతోంది. ఒకట్రెండు సంవత్సరాల్లో జరిగేది కాదు కదా. పటిష్టంగా చేయడానికి ఎక్కువ సమయమే పట్టేటట్లుగా కనిపిస్తోంది. దశల వారీగా వృద్ధి సాధించేందుకు కష్టపడుతున్నాం. ఏటా ఫలితాల్లో కచ్చితంగా మెరుగు సాధిస్తాం.

వైట్ బాల్ క్రికెట్‌కైతే రాణించగలిగేంత

వైట్ బాల్ క్రికెట్‌కైతే రాణించగలిగేంత

రంజీ ట్రోఫీల్లో ఆడితే టీమిండియాలో నేరుగా స్థానం దక్కించుకోవడమనేది పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్‌కైతే రాణించగలిగేంత సన్నద్ధంగా లేం. కానీ, రెడ్ బాల్ క్రికెట్‌కు మాత్రం ఆకస్మికంగా అందించేందుకు క్రికెటర్లను సిద్ధంగానే ఉంచాం. కొద్ది విరామం తర్వాత మళ్లీ నైపుణ్యాన్ని సాన బెట్టుకునేందుకు బరిలోకి దిగుతున్నాం.

ఇప్పటి తరం క్రికెటర్లు మెరుగైన ప్రతిభ

ఇప్పటి తరం క్రికెటర్లు మెరుగైన ప్రతిభ

భవిష్యత్‌లో ఇంకొన్ని ఛాలెంజ్‌లు ఎదురుకావచ్చు. టీమిండియాలో ఆడేందుకు అరుదుగా అవకాశాలు వస్తాయి. ఒక్కోసారి మనం చాలా కష్టపడి.. బాగా ఆడినా అదృష్టం కలిసి రాకపోతే చేసేదేం ఉండదు. కేవలం మన చేతిలో ఉండేది. అయినా ఇప్పటి తరం క్రికెటర్లు గతం కంటే మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారు,.

1
44265
Story first published: Wednesday, October 10, 2018, 12:58 [IST]
Other articles published on Oct 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X