న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీఐపీ లాంజ్‌ను వదిలి సాధారణ సీటింగ్‌తో మ్యాచ్ వీక్షించిన ద్రవిడ్ ఫ్యామిలీ(వీడియో)

Rahul Dravid Opts Common Public Stands Over VIP at Chinnaswamy

హైదరాబాద్: టీమిండియా అండర్ 19 కోచ్ , టీమిండియా సీనియర్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ సింప్లిసిటీకి పెట్టింది పేరు. ఎంత ఉన్నా ఒదిగి ఉంటారని ద్రవిడ్ గురించి తెలిసిన వాళ్లెవరైనా అంటారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. ఆదివారం బెంగళూరు వర్సెస్ కోల్‌కతా జరిగిన మ్యాచ్‌కు స్వస్థలంలో జరుగుతోన్న మ్యాచ్ కు ద్రవిడ్ అతని కుటుంబం మ్యాచ్ వీక్షించేందుకు వచ్చింది.

ద్రవిడ్ హోదాకు కావాలంటే వీఐపీ కేటిగిరీలో కూర్చొని మ్యాచ్ వీక్షించెయ్యెచ్చు. కానీ, సాధారణ కౌంటర్‌లో అందరితో పాటు కూర్చొని కొడుకు, భార్యలతో కలిసి మ్యాచ్ వీక్షించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వహక సంఘం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే, టాస్ అనంతరం కోల్ కతా జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ.. తమ జట్టులో ఉన్న అండర్ 19 కుర్రాళ్లు చక్కగా రాణిస్తున్నారని తెలిపాడు. ఆ ఘనతంతా సీనియర్ క్రికెటర్ ద్రవిడ్ కే చెల్లుతుందని కొనియాడాడు.

ఐపీఎల్ ఆరంభంలో బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహించిన ద్రవిడ్ ఆ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించారు. కొన్ని సీజన్ల అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి కొత్త బాధ్యతలు తీసుకున్నారు. గతేడాది జరిగిన ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ఛీప్ మెంటార్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పోరాటంలో సైతం బెంగళూరు జట్టుకు పరాజయం తప్పలేదు. వరుస వికెట్లు కోల్పోతున్నా.. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టును కోహ్లీ ఒక్కడే నడిపించాడా అన్నట్లు సాగింది స్కోరు బోర్డు. అయితే, ఛేదనలోనూ ఆ జట్టు పెద్దగా రాణించలేకపోయింది. ఫీల్డింగ్ లోపంతో మ్యాచ్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఇదే విషయమై జట్టుపై కోహ్లీ ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు.

ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచ్ లలో కేవలం రెండింటిలోనే విజయం సాధించిన బెంగళూరు జట్టు లీగ్ లో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు జట్టుకు తదుపరి మ్యాచ్ మే1న ముంబై ఇండియన్స్ తో జరగనుంది. ఇంతకుముందు ఇదే జట్టుతో పోటీపడిన బెంగళూరు ఓటమి పాలైంది.

Story first published: Monday, April 30, 2018, 18:26 [IST]
Other articles published on Apr 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X