Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌తో జరిగిన ఆ మ్యాచే నా కెరీర్‌లో ఓ చేదు జ్ఞాపకం

Pakistan ex pacer Shoaib Akhtar reveals sad secret about 2003 World Cup loss to India

కరాచీ: 2003 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్ గురించి పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ఓ రహస్యాన్ని వెల్లడించాడు. 2003 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచే తన కెరీర్‌లో అత్యంత చెత్త మ్యాచ్‌గా, ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిందని అక్తర్‌ పేర్కొన్నాడు. పాకిస్తాన్‌ ఓటమి చెందడం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నాడు. అక్తర్ తన యూట్యూబ్‌ చానెల్‌లో ఒక వీడియో ద్వారా పై వ్యాఖ్యలు చేశాడు.

పటిష్ట బౌలింగ్ ఉన్నా:

పటిష్ట బౌలింగ్ ఉన్నా:

వీడియోలో అక్తర్ మాట్లాడుతూ... 'సెంచూరియన్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మేము 274 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోలేకపోయాం. నా కెరీర్‌లో తీవ్ర నిరాశకు గురి చేసిన మ్యాచ్‌ అది. పటిష్ట బౌలింగ్ ఉన్నా.. మేము ఏం చేయలేకపోయాం. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి ఎడమ మోకాలికి 4-5 ఇంజెక్షన్లు తీసుకోవలసి వచ్చింది. అయినా బౌలింగ్ చేసాను. అయితే మంచి ప్రదర్శన మాత్రం చేయలేదు' అని అక్తర్ తెలిపాడు.

నాపై అరిచారు:

నాపై అరిచారు:

'మా ఇన్నింగ్స్ ముగిసిన తరువాత బహుశా 30-40 పరుగులు తక్కువ సాధించామని నా సహచరులకు చెప్పాను. దీంతో జట్టులోని ఆటగాళ్లందరూ 273 సరిపోదా? అని నాపై గట్టిగా అరిచారు. మనకు టీమిండియాను ఆలౌట్ చేసే సత్తా ఉందన్నారు. అది బ్యాటింగ్‌ పిచ్‌ కావడంతో.. ఆ పరుగులు సరిపోవని నాకు అర్థమైంది. తర్వాత అదే నిజమైంది. భారత ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ మంచి ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా సచిన్‌ అద్భుతంగా ఆడాడు. పాయింట్ మీదుగా కొట్టిన సిక్స్ సూపర్. ఆ మ్యాచ్ ఎప్పటికీ మరచిపోలేను. ఆ మ్యాచ్‌ నాకు ఒక చేదు జ్ఞాపకం' అని అక్తర్‌ పేర్కొన్నాడు.

సచిన్‌ షో:

సచిన్‌ షో:

దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన పాక్ 273 పరుగులు చేసింది. ఓపెనర్ సయీద్ అన్వర్ సెంచరీ (101) చేసాడు. మొహమ్మద్ యూసుఫ్ (25), యూనిస్ ఖాన్ (32) పరుగులు చేశారు. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ నాలుగు ఓవర్లు ఉండగానే విజయం సాధించింది. సచిన్‌ టెండూల్కర్‌ 98 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కైఫ్ (35), ద్రావిడ్ (44), యువరాజ్ (50) రాణించారు.

Story first published: Tuesday, August 6, 2019, 16:49 [IST]
Other articles published on Aug 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+