న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అద్భుతమైన టాలెంట్ ఉంది: రాహుల్ చాహర్‌కు సచిన్ ప్రశంస

Rahul Chahar is a fabulous talent, says Sachin Tendulkar

హైదరాబాద్: ముంబై ఇండియన్స్ యువ లెగ్‌‌స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. చాహర్‌లో అద్భుతమైన ప్రతిభ దాగుందని సచిన్ అన్నాడు. ఉప్పల్ వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ చాహర్‌ అద్భుత ప్రదర్శన చేశాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐపీఎల్ ఫైనల్లో చాహర్‌ నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్‌ పడగొట్టి 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో 13 డాట్ బాల్స్ ఉన్నాయి. చాహర్ స్పెల్ కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ పట్టు బిగించింది. ఈ నేపథ్యంలో చాహర్‌ బౌలింగ్‌ కారణంగానే ముంబై జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించగలిగిందని సచిన్ అభినందించాడు.

క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్‌లో ఎలా బౌలింగ్‌ చేయాలో చాహర్‌ అచ్చం అలాగే చేశాడని, చాహర్‌ బౌలింగ్‌ యాక్షన్‌ బాగుందని సచిన్‌ కొనియాడాడు. ఇరానీ కప్‌ రెస్టాఫ్ ఇండియాకు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన చాహర్‌ 81 ఓవర్ల పాటు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీని కారణంగానే అతడిని ముంబై యాజమాన్యం వేలంలో కొనుగోలు చేసింది.

ఈ సీజన్‌లో చాహర్‌ మొత్తం 13 మ్యాచ్‌లాడి 6.55 యావరేజితో 13 వికెట్లు పడగొట్టాడు. రాహుల్ చాహర్‌ బౌలింగ్‌పై ఆ జట్టు కోచ్ మహిళా జయవర్దేనే సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. చాహర్‌ అద్భుతమైన బౌలర్ అని, అతడు ఈ సీజన్ మొత్తం మాపై ఒత్తిడిని పెంచాడని చెప్పుకొచ్చాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది.

చెన్నై జట్టులో షేన్ వాట్సన్(80) చివరివరకు పోరాడాడు. ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఈ తరుణంలో అనూహ్యంగా పుంజుకొన్న ముంబై బౌలర్లు వాట్సన్‌ను రనౌట్‌ చేయడంతో తిరిగి పోటీలోకొచ్చింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో ఇరు జట్ల శిబిరాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దీంతో అందరూ సూపర్‌ ఓవర్‌ ఖాయమేనని అనుకున్నారు.

అయితే, చివరి బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ వికెట్‌ తీసి మలింగ మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముంబై చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌ చరిత్రలో నాలుగు టైటిళ్లను నెగ్గిన జట్టుగా ముంబై అరుదైన ఘనత సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కి మొత్తం 32,405 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

Story first published: Monday, May 13, 2019, 17:29 [IST]
Other articles published on May 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X