న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్, జడేజా రికార్డు బద్దలు: 10 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు

West Indies Spinner Cornwall Does What Ashwin, Ravindra Jadeja Couldn't || Oneindia Telugu
Rahkeem Cornwall beats Ashwin, Jadeja to become 1st spinner to pick 10 wickets in a Test in India in 33 months

హైదరాబాద్: వెస్టిండిస్ ఆఫ్ స్పిన్నర్ రకీమ్ కార్నివాల్ అరుదైన ఘనత సాధించాడు. గురువారం భారత్‌లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో రెండేళ్ల తర్వాత పది వికెట్లు తీసి తొలి స్ఫిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో రకీమ్ కార్నివాల్ ఈ ఘనత సాధించాడు.

లక్నో వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన రకీమ్ కార్నివాల్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి కార్నివాల్ మొత్తంగా 10 వికెట్లు సాధించాడు.

గాయాలు పాలవుతున్న బుమ్రా: అసలు కారణం చెప్పిన కపిల్ దేవ్గాయాలు పాలవుతున్న బుమ్రా: అసలు కారణం చెప్పిన కపిల్ దేవ్

ఉపఖండంలో ఆడుతున్న రెండో టెస్టులో 10 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాల రికార్డుని కార్నివాల్ బద్దలు కొట్టాడు. 2016లో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా రవి చంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలు ఒక టెస్టులో 10 వికెట్లను సాధించారు. ఆ తర్వాత ఏడాది వ్యవధిలో ఓకీఫ్‌ 10 వికెట్లకు పైగా సాధించి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మళ్లీ ఇప్పుడు రాకిమ్‌ 10 వికెట్లతో మెరిసి విండీస్‌ గెలుపులో అతి పెద్ద పాత్ర పోషించాడు. దీంతో పాటు విదేశాల్లో ఆడే టెస్టుల్లో పది అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఏడో విండిస్ స్పిన్నర్‌గా గుర్తింపు సాధించాడు.

కార్నివాల్‌కు ముందు ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్ అమీర్ హంజా తన టెస్టు అరంగేట్రంలో 5 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఆప్ఘన్ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకు ఆలౌటైంది. గురువారం రెండో రోజు ఆటలో వెస్టిండీస్‌ 277 పరుగులకు ఆలౌటైంది. షామరాహ్‌ బ్రూక్స్‌(111) తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు.

నాలోని అతి విశ్వాసమే ఓటమికి కారణం: సెమీస్‌లో కివీస్‌తో మ్యాచ్‌పై కోహ్లీనాలోని అతి విశ్వాసమే ఓటమికి కారణం: సెమీస్‌లో కివీస్‌తో మ్యాచ్‌పై కోహ్లీ

దీంతో విండిస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన అఫ్గానిస్తాన్‌ ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. భద్రతపరమైన సమస్యల కారణంగా ఆప్ఘనిస్థాన్ దట్టు తమ మ్యాచ్‌లను స్వదేశంలో కాకుండా లక్నోలోని వాజపేయి స్టేడియంలో ఆడుతోంది.

Story first published: Friday, November 29, 2019, 12:00 [IST]
Other articles published on Nov 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X