న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ర్యాంకులు: అగ్రస్ధానంలో రబడ, దిగజారిన కోహ్లీ ర్యాంకు

By Nageshwara Rao
Rabada surges to summit of Test rankings!

హైదరాబాద్: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా యువ పేసర్ కగిసో రబడ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన ఏడో ఆటగాడిగా రబాడ నిలిచాడు. మంగళవారం ప్రకటించిన ర్యాకింగ్స్‌లో ఒక్క స్థానాన్ని మెరుగు పరుచుని అగ్రస్ధానంలో నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టాడు.

కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 3/34, 2/41తో రాణించిన రబడ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 5 పాయింట్లు మెరుగు పరుచుకుని 888 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, యాషెస్‌ సిరీస్‌లో చివరిదైన సిడ్నీ టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన అండర్సన్‌ ఐదు పాయింట్లు కోల్పోయి 887 పాయింట్లకు పడిపోయాడు.

టీమిండియా బౌలర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లు తమ ర్యాంకులను నిలుపుకున్నారు. 861 పాయింట్లతో జడేజా, 830 పాయింట్లతో అశ్విన్‌లు వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. కేప్‌టౌన్‌ టెస్టులో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన భారత పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ కెరీర్‌లోనే అత్యుత్తమంగా 22వ ర్యాంకును దక్కించుకున్నాడు.

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్‌ పాండ్యా 24 స్థానాలు ఎగబాకి 49వ స్థానంలో నిలిచాడు. ఇక బ్యాట్స్ మెన్ ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కింగ్‌ కోహ్లీ ఒక స్థానాన్ని కోల్పోయి 880 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

947 పాయింట్లతో ఆసీస్‌ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్‌ కెప్టెన్ జో రూట్‌(881) ఉన్నాడు. ఇక, పుజారా రెండు స్థానాలు కోల్పోయి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఐసీసీ టెస్టు ర్యాంకులు:
బౌలర్లు:
1 Kagiso Rabada (SA) - 888
2 James Anderson (Eng) - 887
3 Ravindra Jadeja (Ind) - 861
4 R. Ashwin (Ind) - 830
5 Josh Hazlewood (Aus) - 814
6 Vernon Philander (SA) - 806
7 Rangana Herath (SL) - 799
8 Neil Wagner (NZ) - 784
9 Nathan Lyon (Aus) - 769
10 Mitchell Starc (Aus) - 769

బ్యాట్స్‌మెన్:

1 Steve Smith (Aus) - 947
2 Joe Root (Eng) - 881
3 Virat Kohli (Ind) - 880
4 Kane Williamson (NZ) - 855
5 C. Pujara (Ind) - 848
6 David Warner (Aus) - 827
7 Azhar Ali (Pak) - 755
8 D. Chandimal (SL) - 743
9 Alastair Cook (Eng) - 742
10 Hashim Amla (SA) - 740

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 19:22 [IST]
Other articles published on Jan 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X