ఐపీఎల్ నుంచి రబాడను ఎందుకు తప్పించారు?

Posted By:
Rabada ruled out of IPL with back injury

హైదరాబాద్: పదకొండో సారైనా ట్రోఫీ గెలుచుకుందామనే ఆశలు జట్టులో మార్పులు చేసి మరీ సిద్ధమైంది ఢిల్లీ జట్టు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ రెండు రోజుల ముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని పొందిన టెస్ట్ బౌలర్ కగిసో రబాడ జట్టు నుంచి తప్పుకున్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఇటీవల అతను గాయానికి గురైయ్యాడట. దీంతో లీగ్ నుంచి తప్పుకున్నాడు. రబాడ లోయర్ బ్యాక్ స్ట్రెస్ రియాక్షన్‌తో బాధపడుతున్నాడని క్రికెట్ సౌతాఫ్రికా గురువారం తెలిపింది. అతడు మూడు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుందని సౌతాఫ్రికా టీమ్ మేనేజర్ మొహమ్మద్ మూసాజీ తెలిపారు.

నెల రోజుల పాటు రబాడ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. జూలైలో ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటన నాటికి అతడు ఫిట్‌గా ఉండాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టులు సిరీస్‌లో రబాడ 23 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

ఇప్పటికే బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌కు దూరమయ్యారు. గాయం కారణంగా మిచెల్ స్టార్క్ కూడా ఐపీఎల్‌లో ఆడటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కొత్తగా కెప్టెన్ అయిన గౌతం గంభీర్ సేనను ఎలా నడిపించనున్నాడో చూడాలంటే ఏప్రిల్ 8వరకు వేచి చూడాలి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 8:43 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి