న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సూపర్ ఓవర్‌లో అన్నీ యార్కర్లే: రబాడ ప్రామిస్ చేశాడు (వీడియో)

Rabada promised to bowl only yorkers in Super Over vs KKR: DC captain Iyer

హైదరాబాద్: సూపర్ ఓవర్‌లో కగిసో రబాడ యార్కర్లు మాత్రమే వేస్తానని తనకు మాటిచ్చాడని మ్యాచ్‌ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో ఫిరోజ్ షా కోట్లా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన టీ20 మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు విజయం కోసం చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు తలబడ్డాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

రబాడ అద్భుత బౌలింగ్‌తో

చివరకు సూపర్‌ ఓవర్‌లో రబాడ అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాను కట్టడి చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయాన్నందించాడు. ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ "సూపర్‌ ఓవర్‌ వేసే ముందు రబడ నేను మాట్లాడుకున్నాం. ఈ ఓవర్‌ మొత్తం యార్కర్లే మాత్రమే సంధిస్తానని రబాడ ఒట్టేశాడు" అని అన్నాడు.

యార్కర్లు సంధించి విజయాన్నందించాడు

"చెప్పినట్టే ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ఇలా ప్రతి బాల్‌ అద్భుతంగా యార్కర్లు సంధించి విజయాన్నందించాడు. సూపర్‌ ఓవర్‌ ఆడాల్సిన పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. కుల్దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ఇక నుంచి ఒక ఓవర్‌ మిగిలుండగానే విజయం అందుకునేలా జాగ్రత్తపడతాం" అని అయ్యర్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

రబాడ మాట్లాడుతూ

కోల్‌కతా భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో దూకుడుగా ఆడాలని బ్యాట్స్‌మెన్‌ అందరం అనుకున్నామని, పృథ్వీషా ఆ దిశగా ఆడాడని, తన ఆటను అలానే కొనసాగిస్తాడని కూడా భావిస్తున్నట్లు శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం రబాడ మాట్లాడుతూ ఒత్తిడిలో బౌలింగ్‌ చేసి జట్టుకు విజయాన్నందించడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు.

రబాడ వేసిన సూపర్‌ ఓవర్లో కేకేఆర్ 7 పరుగులు

యార్కర్లు మాత్రమే సంధించాలని భావించానని, తన ప్రణాళిక పనిచేయడంతో విజయం దక్కిందని చెప్పుకొచ్చాడు. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ ఒక వికెట్‌ నష్టానికి 10 పరుగులు చేసింది. అనంతరం రబాడ వేసిన సూపర్‌ ఓవర్లో కోల్‌కతా 4, 0, ఔట్‌ (రసెల్‌), 1, 1, 1లతో మొత్తం 7 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, March 31, 2019, 15:11 [IST]
Other articles published on Mar 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X