న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇష్టం వచ్చిన వాళ్లను పిలవడానికి ఇదేమైనా నా అత్తగారిల్లా.. సిరాజ్!

R Sridhar says Mohammed Sirajs comeback on Australia tour shows how tough Indian youngsters are

న్యూఢిల్లీ: మహ్మద్ సిరాజ్ .. క్రికెట్ సర్కిల్‌లో మారుమోగుతున్న పేరు. ఆటోడ్రైవర్ కొడుకుగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి బీఎండబ్ల్యూ కారు వరకు ఎదిగిన సిరాజ్ జీవితం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకం! ఇటివలే ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ హైదరాబాద్ గల్లీ బాయ్.. తన కెరీర్‌‌లో మరో స్థాయికి చేరాడు. ఈ పర్యటనలో ఉండగానే అనారోగ్యంతో అతని తండ్రి మహ్మద్ గౌస్ మరణించినా.. ఆయన కలను నెరవేర్చేందుకు అక్కడే ఉండిపోయాడు. ఆ బాధను పంటి బిగువనే భరిస్తూ అద్భుత ప్రదర్శనతో ఘన నివాళిలర్పించాడు.

గబ్బా వేదికగా 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మహ్మద్ సిరాజ్ గురించి టీమిండియా ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్ మాజీ క్రికెటర్ ఆర్. శ్రీధర్ తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

అదో గొప్ప విషయం..

అదో గొప్ప విషయం..

రవిచంద్రన్ అశ్విన్‌ యూట్యూ‌బ్ చానెల్‌తో చిట్ చాట్ చేసిన శ్రీధర్.. ఆసీస్ పర్యటన విశేషాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా సిరాజ్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు. 'తన తండ్రి మరణవార్త తెలిసిన తర్వాత సిరాజ్ చాలా బాధపడ్డాడు. ఆ టైమ్‌లో క్వారంటైన్ రూల్స్ కారణంగా మేం అతని గదిలోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దాంతో, తను సరిగ్గా తింటున్నాడో లేదో కనుక్కునేందుకు నేను, విహారి రోజు వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాళ్లం. అంత కష్టకాలంలోనూ సిరాజ్ జట్టుతోనే ఉండాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం.

నా అత్తగారిల్లు కాదు..

నా అత్తగారిల్లు కాదు..

భారత్‌కు ఆడాలని సిరాజ్ చాలా పట్టుదలగా ఉండేవాడు. రెండేళ్ల నుంచి భారత్-ఎ తరఫున బాగా రాణించినప్పుడుల్లా నాకు ఫోన్ చేసేవాడు. సర్ నన్నెప్పుడు జట్టులోకి పిలుస్తున్నారు అనేవాడు. నేనేమో.. నా ఇష్టం వచ్చిన వాళ్లను పిలవడానికి అదేమైనా నా అత్తగారిల్లా.. అని నవ్వుకునేవాడిని. కానీ తన తండ్రి మరణం తర్వాత సిరాజ్ చూపించిన నిబ్బారినిక హ్యాట్సాఫ్.'అని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పర్యటనలో మెల్‌బోర్న్ టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌ను ప్రారంభించిన సిరాజ్ 3 మ్యాచ్‌ల్లో 13 వికెట్లతో సత్తా చాటాడు.

పంత్.. ప్లాన్ మార్చేశాడు..

పంత్.. ప్లాన్ మార్చేశాడు..

జట్టు ప్రణాళికను యువ వికెట్ కీపర్ రిషభ్ మార్చేశాడని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. 'తొలుత డ్రా కోసం పోరాడాలి, ఆఖరి పది ఓవర్లలో విజయం కోసం గేర్‌ను మార్చాలి' అనేది జట్టు ప్రణాళిక. కానీ పంత్ బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్ గమనాన్ని మార్చాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ ప్రదర్శన కీలకం. ఎన్నో ప్రతికూలతల్లో అతడు అయిదు వికెట్లు పడగొట్టాడు. జట్టు మొత్తానికి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ ఇవ్వాలి.

శార్దూల్ కవర్ డ్రైవ్స్ సూపర్..

శార్దూల్ కవర్ డ్రైవ్స్ సూపర్..

తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయాం. ఈ దశలో సుందర్‌తో కలిసి శార్దూల్ ఇన్నింగ్స్‌ గొప్పగా నిర్మించాడు. శార్దూల్‌ బ్యాటింగ్ ఆడిన తీరు అద్భుతం. అతను ఆడిన కవర్‌డ్రైవ్స్‌ సిరీస్‌లోనే హైలైట్‌‌గా నిలిచాయి. అందుకే అతనికి అశ్విన్‌.. 'శార్దులకర్‌' అని నిక్‌నేమ్ పెట్టాడు. సచిన్‌లా అతను కవర్‌డ్రైవ్స్‌ ఆడాడు. ఆసీస్‌ పేస్‌ త్రయం కమిన్స్‌, స్టార్క్‌, హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో బౌండరీలు సాధించాడు. సుందర్‌ కూడా గొప్పగా ఆడాడు' అని శ్రీధర్‌ ప్రశంసించాడు.

Story first published: Sunday, January 24, 2021, 13:20 [IST]
Other articles published on Jan 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X