న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Qualifier 2: సన్‌రైజర్స్‌కు షాక్‌.. హోల్డర్ ఔట్.. పోరాడుతున్న కేన్!!

Jason Holder departs as Kane Williamson keeps SRH in hunt

అబుదాబి: క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక బ్యాట్స్‌మన్‌ జాసన్ హోల్డర్ (11: 15 బంతుల్లో 1ఫోర్) వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడిన హోల్డర్.. బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఔట్ అయ్యాడు. అయితే కేన్ విలియమ్సన్‌ మాత్రం భారీ షాట్లు ఆడుతూ స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో కేన్‌కిది 15వ అర్ధశతకం. కీలక బ్యాట్స్‌మన్‌ పెవిలియన్ చేరడంతో భారం మొత్తం విలియమ్సన్‌పైనే పడింది.

కాగిసో రబాడ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే సన్‌రైజర్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మొదటి బంతికే కెప్టెన్ డేవిడ్‌ వార్నర్ ‌(2) బౌల్డ్‌ అయ్యాడు. అన్రిచ్ నోర్జ్ వేసిన మూడో ఓవర్లో మనీశ్‌ పాండే ఫోర్‌.. ప్రియం గార్గ్‌ సిక్సర్‌ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేశారు. దాంతో సన్‌రైజర్స్‌ స్కోర్ మెరుగ్గా కనిపించింది.

మార్కస్ స్టోయినీస్‌ వేసిన ఐదో ఓవర్లో ప్రియం గార్గ్ ‌(17) కూడా బౌల్డ్‌ అయ్యాడు. అదే ఓవర్‌ ఆఖరి బంతికి మనీశ్‌ పాండే (21).. నోర్జ్ కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరడంతో మ్యాచ్‌పై ఢిల్లీ పట్టు సాధించింది. 5 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. అప్పటినుంచి సన్‌రైజర్స్‌ స్కోర్ వేగం పూర్తిగా తగ్గింది. విలియమ్సన్, హోల్డర్ హోల్డర్ ఆచితూచి ఆడడంతో సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిచిపోయింది. దీంతో భారీ షాట్ ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. సన్‌రైజర్స్‌ విజయానికి 34 బంతుల్లో 70 రన్స్ కావాలి.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ ‌(78: 50 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో చెలరేగడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ మార్కస్‌ స్టాయినీస్ ‌(38: 27 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌), హెట్‌మైర్ ‌(42 నాటౌట్‌: 22 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో ఢిల్లీ పటిష్ఠ స్థితిలో నిలిచింది. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ(1/30), రషీద్‌ ఖాన్(1/26)‌ కట్టుదిట్టంగా బంతులేశారు.

Story first published: Sunday, November 8, 2020, 22:55 [IST]
Other articles published on Nov 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X