
సర్టిఫికేట్స్ నకిలీవని:
సమర్పించిన సర్టిఫికేట్స్ నకిలీవని: దీంతో పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖలో డీఎస్పీ జాబ్‌ని ఆఫర్ చేయగా.. ఈ ఏడాది మార్చి 1న పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ చేతుల మీదుగా ఆమె బాధ్యతలు చేపట్టారు. కానీ.. ఆ సమయంలో సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్స్ నకిలీవని తాజాగా పంజాబ్ పోలీసులు తేల్చారు.

ఆమె ఒప్పుకుంటే.. కానిస్టేబుల్ ఉద్యోగం
2011లో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి తాను డిగ్రీ పాసైనట్లు హర్మన్‌ప్రీత్ కౌర్ పోలీసు శాఖకి సర్టిఫికేట్స్ సమర్పించింది. కానీ.. విచారణలో అవి నకిలీవని తేలింది. దీంతో.. ఇక నుంచి హర్మన్‌ప్రీత్‌ని 12వ తరగతి మాత్రమే పాసైనట్లుగా పంజాబ్ ప్రభుత్వం పరిగణిస్తుందని.. ఆమె అర్హతకి పోలీసు శాఖలోనే కానిస్టేబుల్ ఉద్యోగం (ఆమె ఒప్పుకుంటే) ఇవ్వనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదని
నకిలీ సర్టిఫికేట్స్ సమర్పించినప్పటికీ.. హర్మన్‌ప్రీత్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన వివరించారు. హర్మన్‌ప్రీత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే.. ఇప్పటికే ఆమె అందుకున్న అర్జున అవార్డుని కూడా కోల్పోవాల్సి వస్తుంది.

రైల్వేలో జాబ్ వదిలేసి.. డీఎస్పీగా
ఈ ఘటనపై హర్మన్‌ప్రీత్ కౌర్ మేనేజర్ స్పందిస్తూ.. ఈ విషయంలో ఇప్పటి వరకు పంజాబ్ పోలీస్ శాఖ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. ఇదే సర్టిఫికేట్‌తో ఆమె రైల్వేలో ఉద్యోగం చేసిందని, అది ఇప్పుడేలా నకిలీది అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక ఆమె పంజాబ్ పోలీస్ శాఖలో చేరే కొద్ది కాలం ముందే రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశారు.