న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజస్థాన్‌పై పంజాబ్ విజయం.. అశ్విన్‌ డాన్స్‌ (వీడియో)

Punjab vs Rajasthan: Ravichandran Ashwin Sit On A Dhol and Dance after match win

మొహాలి వేదికగా మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పంజాబ్ తన ఖాతాలో ఐదో విజయాన్ని వేసుకోగా.. ఆరో ఓటమితో రాజస్తాన్‌ ప్లే ఆఫ్ అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం పంజాబ్ ఆటగాళ్ల్లు మైదానంలో సందడి చేసారు.

అశ్విన్‌ డాన్స్‌:

మ్యాచ్‌ గెలిచిన ఆనందంలో పంజాబ్‌ ఆటగాళ్లు మైదానంలో డాన్స్‌లు చేశారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌తో కలిసి డ్రమ్స్‌ వాయిస్తూ డాన్స్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. పంజాబ్ కెప్టెన్ అశ్విన్‌ను సహచర ఆటగాళ్లు తీసుకొచ్చి డాన్స్ వేయించారు. అనంతరం అశ్విన్‌ డ్రమ్ పై కూర్చోగా.. పంజాబ్ ఆటగాడు డ్రమ్ వాయించాడు. ఈ వీడియోను పంజాబ్‌ జట్టు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ పేజీలలో పోస్ట్ చేసింది.

ప్రీతి ఇంటర్వ్యూ:

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా.. బౌలర్ అర్షదీప్ సింగ్ ను ఇంటర్వ్యూ చేసింది. నిన్నటి మ్యాచ్‌తో అర్షదీప్ సింగ్ ఆరంగేట్రం చేసాడు. ఈ సందర్భంగా ప్రీతి అతనిని ఇంటర్వ్యూ చేసింది. 'అర్షదీప్ లాగే అందరు యువకులు ఐపీఎల్ లోకి వచ్చి తన కళలను సాకారం చేసుకోండి' అని ప్రీతి సూచించింది.

బ్యాట్, బంతితో మెరిసిన అశ్విన్‌:

బ్యాట్, బంతితో మెరిసిన అశ్విన్‌:

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ లోకేశ్‌ రాహుల్‌ 52(47 బంతుల్లో; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిల్లర్‌ 40(27 బంతుల్లో; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ అశ్విన్‌ 17 నాటౌట్‌ (4 బంతుల్లో; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పరుగులు చేసారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌.. 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి ఓటమిని ఎదుర్కొంది. రాహుల్‌ త్రిపాఠి 50(45 బంతుల్లో; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో స్టువర్ట్ బిన్నీ (11 బంతుల్లో; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. అశ్విన్ 2 వికెట్లు తీశాడు. బ్యాట్, బంతితో మెరిసిన అశ్విన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Story first published: Wednesday, April 17, 2019, 14:02 [IST]
Other articles published on Apr 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X