న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PSL 2021: వైరల్ వీడియో.. పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య గొడవ!!

PSL 2021: Shaheen Afridi and Sarfaraz Ahmed exchange heated words after bouncer hits helmet

అబుదాబి: పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌ (పీఎస్‌ఎల్) 2021లో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, యువ ఫాస్ట్‌ బౌలర్‌ షాహిన్‌ షా అఫ్రిది పరస్పరం ఒకరినొకరు దూషించుకున్నారు. మంగళవారం రాత్రి క్వెటా గ్లాడియేటర్స్‌, లాహోర్‌ ఖలండర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. అఫ్రిది విసిరిన బౌన్సర్ బంతి గ్లాడియేటర్స్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ హెల్మెట్‌కి బలంగా తాకింది. దాంతో సహనం కోల్పోయిన సర్ఫరాజ్.. నోరుజారాడు. అందుకు అఫ్రిది కూడా ఘాటుగా సమాధానమిచ్చాడు. అంపైర్లు, సహచర ఆటగాళ్లు కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

విషయంలోకి వెళితే... ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన షాహిన్ షా అఫ్రిది ఆఖరి బంతిని 147కిమీ వేగంతో వేశాడు. బౌన్సర్ రూపంలో వచ్చిన బంతిని ఫుల్ చేసేందుకు గ్లాడియేటర్స్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రయత్నించాడు. కానీ బ్యాట్‌కి దొరకని బంతి వేగంగా వెళ్లి అతడి హెల్మెట్‌కి బలంగా తాకింది. ఆపై థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. దాంతో సర్ఫరాజ్ సింగిల్ కోసం పరుగెత్తుతూ.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి వెళ్లాడు. అక్కడే నిల్చొని బాల్‌ని చూస్తున్న షాహిన్ అఫ్రిదితో గొడవకి దిగాడు. ఆపై నాకే బౌన్సర్‌ వేస్తావా? అన్నట్లుగా కోపంతో చూశాడు.

సర్ఫరాజ్ అహ్మద్ మాటలకి ఘాటుగా బదులిచ్చిన షాహిన్ అఫ్రిది అతనికి చేరువగా వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో లాహోర్‌ కెప్టెన్‌ సోహైల్‌ అక్తర్‌, సీనియర్‌ ఆటగాడు మహ్మద్‌ హపీజ్‌ వచ్చి వారిద్దరిని విడదీశారు. ఫీల్డ్‌ అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఓవర్‌ ముగిసిన అనంతరం హఫీజ్‌.. సర్ఫారజ్‌ దగ్గరికి వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆపై ఫిజియో వచ్చి సర్ఫరాజ్ గాయాన్ని పరిశీలించి వెళ్లాడు. ఒక సీనియర్‌ ఆటగాడిపై నియంత్రణ కోల్పోయి అఫ్రిది ఇలా చేయడంపై అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

WTC Final 2021కు వర్ష గండం.. అరంగేట్ర టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతేనా!!WTC Final 2021కు వర్ష గండం.. అరంగేట్ర టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతేనా!!

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్వెటా గ్లాడియేటర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 158 పరుగులు చేసింది. గ్లాడియేటర్స్‌ బ్యాటింగ్‌లో వెథర్‌లాండ్‌ 48 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ సర్ఫరాజ్​ 34, అజమ్‌ ఖాన్‌ 33 పరుగులతో రాణించారు. ఫాల్కనర్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాహోర్‌ ఖలందర్స్‌ 18 ఓవర్లలో140 పరుగులకే ఆలౌట్‌ అయి 18 పరుగులతో ఓటమిని చవిచూసింది. టీమ్ డేవిడ్ ఒక్కడే 46 పరుగులతో పోరాడాడు. ఉస్మాన్ షిన్వారీ, ఖుర్రం షాజాద్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.

Story first published: Wednesday, June 16, 2021, 14:48 [IST]
Other articles published on Jun 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X