న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వికెట్‌ తీయగానే.. జెర్సీ విప్పేసిన సీనియర్ స్పిన్నర్! అసలు కారణం ఇదే (వీడియో)!

PSL 2021: Imran Tahir removes his jersey after picking a wicket

కరాచీ: దక్షిణాఫ్రికా సీనియర్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్‌లో పుట్టినా.. తన ప్రేయసి కోసం దక్షిణాఫ్రికా వెళ్లి సెటిల్ అయ్యాడు. వికెట్ తీసినప్పుడు తాహిర్ సంబరాలు ప్రత్యేకంగా ఉంటాయి. రెండు చేతులా చాపి పిచ్ దగ్గర నుంచి అల్లంత దూరం పరుగెత్తుతూ తెగ సంబరపడిపోతుంటాడు. అయితే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ముల్తాన్‌ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు మాత్రం కాస్త బిన్నంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. వికెట్ తీసిన ఆనందంలో జెర్సీ విప్పేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. అయితే తాహిర్‌ ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉంది.

 India vs England: టీమిండియాకు ఇంతకాలం కెప్టెన్‌గా కొనసాగడం నమ్మశక్యంగా లేదు: కోహ్లీ India vs England: టీమిండియాకు ఇంతకాలం కెప్టెన్‌గా కొనసాగడం నమ్మశక్యంగా లేదు: కోహ్లీ

ముగల్‌ మృతికి నివాళిగా:

గత జనవరి 10న పాకిస్తాన్‌ లోకల్‌ క్రికెటర్‌ తాహిర్‌ ముగల్‌ అనారోగ్యం (క్యాన్సర్)తో కన్నుమూశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 503 వికెట్లు తీసిన 43 ఏళ్ల ముగల్‌ లాహారి కోచ్‌గా పనిచేసేవాడు. ఆయన మృతికి నివాళిగా వికెట్ పడగానే దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ జెర్సీ తీసేశాడు. అయితే తాహిర్‌.. ముగల్‌ ఫోటో ఉన్న షర్ట్‌ను ధరించి అతనికి ఘనమైన నివాళి అందించాడు. 'మై బ్రదర్‌ మిస్‌ యూ.. రిప్‌' అని షర్ట్‌పై రాసి ఉంది. తాహిర్‌ చర్యతో మొదటగా ఆశ్యర్యపోయిన ముల్తాన్‌ సుల్తాన్‌ ఆటగాళ్లు తర్వాత విషయం తెలుసుకొని అతన్ని అభినందనలతో ముంచెత్తారు.

తాహిర్‌పై ప్రశంసల వర్షం:

తాహిర్‌పై ప్రశంసల వర్షం:

ఇమ్రాన్‌ తాహిర్ ‌పీఎస్‌ఎల్‌లో బుధవారం ఆడిన మొదటి మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 1 వికెట్‌ తీశాడు. 8వ ఓవర్ చివరి బంతికి క్వెటా గ్లాడియేటర్స్‌ బ్యాట్స్‌మన్‌ సైమ్ అయూబ్ వికెట్ తీశాడు. అప్పుడే తాహిర్‌ జెర్సీ తీసేశాడు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ పీఎస్‌ఎల్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. 'ఈ ఏడాది ప్రారంభంలో కన్నుమూసిన తాహిర్‌ ముగల్‌ కోసం తాహిర్ ఘనమైన నివాళి అర్పించాడు. ఈ ఘటన అందరి హృదయాలను హత్తుకుంది' అని ట్వీట్ చేసింది. అభిమానులు కూడా తాహిర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

గ్లాడియేటర్స్‌ విజయం:

గ్లాడియేటర్స్‌ విజయం:

ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్‌ చేసిన క్వెటా గ్లాడియేటర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ (51 బంతుల్లో 81, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్‌ సుల్తాన్‌ 19.4 ఓవర్లలో 154 పరుగులు చేసి ఆలౌటైంది. ముల్తాన్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. గ్లాడియేటర్స్‌ బౌలర్లలో కైస్‌ అహ్మద్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

డ్రింక్స్‌ మోస్తూ:

డ్రింక్స్‌ మోస్తూ:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే)కు ఇమ్రాన్‌ తాహిర్ ఆడుతున్న విషయం తెలిసిందే. 2019 సీజన్‌లో చెన్నై తరఫున 17 మ్యాచ్‌లు ఆడి 26 వికెట్లు తీశాడు. అయితే యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో మాత్రం కేవలం 3 మ్యాచ్‌లే ఆడి ఒక వికెట్‌ తీశాడు. షేన్ వాట్సన్‌, ఫాఫ్ డుప్లెసిస్‌, డ్వేన్ బ్రేవో, సామ్‌ కరన్‌లకే అవకాశాలు ఇవ్వడంతో తాహీర్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఆల్‌రౌండర్‌ల కోటాలో కరన్‌ వైపే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మొగ్గుచూపడంతో తాహీర్‌ డ్రింక్స్‌ మోస్తూ వచ్చాడు. మరి ఈసారైనా అవకాశాలు వస్తాయో చూడాలి. భారత్‌ గడ్డపైనే ఐపీఎల్ 2021 సీజన్‌ ఏప్రిల్- జూన్ నెలలో జరుగనుంది.

Story first published: Thursday, March 4, 2021, 14:40 [IST]
Other articles published on Mar 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X