సిరిస్ సమం: రెండో టెస్టులో ఆసీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

Posted By:
Proteas level Test series against Australia

హైదరాబాద్: పోర్ట్ ఎలిజబెత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టు మ్యా‌చ్‌ల సిరిస్ 1-1తో సమం అయింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా 2018 2nd టెస్టు స్కోరు కార్డు

ఆస్ట్రేలియా నిర్దేశించిన 101 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 22.5 ఓవర్లలో చేధించింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మర్క్రమ్ (21), డీన్ ఎల్గర్ (5) పరుగులకే పెవిలియన్‌కు చేరగా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హషీమ్‌ ఆమ్లా(27), డివిలియర్స్‌(28), డిబ్రన్‌(15 నాటౌట్‌) పరుగులతో రాణించారు.

అంతకముందు 180/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగోరోజైన సోమవారం ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 59 పరుగులకే మిగితా ఐదు వికెట్లను కోల్పోయింది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి ఆసీస్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన రబాడకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు... రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన రబాడ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఎక్కువ సార్లు 10 వికెట్లు తీసిన మూడో సఫారీ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు రబాడ నాలుగు సార్లు ఈ ఘనతను సాధించగా... డేల్ స్టెయిన్(5), ఎన్తీని(4)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రబాడ కేవలం 28 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు.

Story first published: Monday, March 12, 2018, 18:27 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి