న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: తండ్రి క్రికెటర్, కొడుకు ఫుట్‌బాల్ లెర్నర్

Prolific In Cricket, Shane Watson Gets Schooled By His Son In Corridor Football

హైదరాబాద్: ఐపీఎల్ జరుగుతుండగా క్రికెట్ అభిమానులకి ఆటగాళ్ల గురించి ఏం తెలిసినా కుతూహలంతో ఇంకొంచెం తెలుసుకోవాలనే కుతూహలంతో ఎదురుచూస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు తమ క్రికెటర్ల విశేషాలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకొంటున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ కుటుంబ విషయం ఒకటి బయటపెట్టింది.

ప్రస్తుతం షేన్ వాట్సన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కుటుంబంతో సహా విచ్చేసిన వాట్సన్ తన కొడుకుతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడుతూ.. కెమెరా కంటికి చిక్కాడు. దీంతో సీఎస్‌కే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆ వీడియోను పోస్టు చేసింది.

షేన్‌ వాట్సన్‌ తన కుమారుడితో కలిసి హోటల్‌ కారిడార్‌లో ఫుట్‌బాల్‌ ఆడాడు. సరదా కోసం ఆడుతున్నప్పటికీ వాట్సన్‌ కుమారుడు మాత్రం గేమ్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. బాల్‌ కోసం తండ్రిని వెనక్కి నెట్టేస్తూ మరీ పోటీపడ్డాడు. కొడుకు పట్టుదలను చూసిన వాట్సన్‌.. అతని ఆటను ఎంజాయ్‌ చేస్తూ కాసేపు అలాగే ఉండిపోయాడు. 'వట్టూ బ్రేకింగ్‌ ద వట్టూ డిఫెన్స్‌' అంటూ ఈ తండ్రీ కొడుకుల సరదా వీడియోను సీఎస్‌కే టీమ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ప్రయాణం మొదలుపెట్టిన షేన్ వాట్సన్.. కొన్నేళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు తరపున ఆడి ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. ఆస్ట్రేలియా అంతర్జాతీయ జట్టుకు రిటైర్ అయినా సరే పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్), బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లలో సైతం ఆడుతున్నాడు. ఐపీఎల్ తో పాటుఆడిన ప్రతి మ్యాచ్ లోనూ తన ఆల్‌రౌండర్ స్కిల్స్‌తో పాటుగా కాస్త వైవిద్యాన్ని జోడిస్తాడు. చెన్నై జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 20న పోటీపడనుంది.

Story first published: Thursday, April 19, 2018, 15:54 [IST]
Other articles published on Apr 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X