న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రొ కబడ్డీ లీగ్ ఆరంభోత్సవానికి శ్రుతి హాసన్

Pro Kabaddi 2018 : Tamil Thalaivas Crush Patna Pirates 42-26 In Opening Clash
Pro Kabaddi League 2018, Tamil Thalaivas vs Patna Pirates: When and where to watch

న్యూఢిల్లీ: దేశీవాలీ సూపర్ లీగ్ కబడ్డీకి సమయం ఆసన్నమైంది. మరి కొద్ది గంటల్లో క్రీడాభిమానులను ఉర్రూతలూగించేందుకు లీగ్ ముస్తాబైంది. ఈ క్రమంలో.. ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌ ఆదివారం నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. తొలి రోజు జరిగే మ్యాచ్‌లలో తమిళ్‌ తలైవాస్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌... పుణేరీ పల్టన్‌తో యు ముంబా తలపడతాయి.

 తమిళ్‌ తలైవాస్‌ను తెలుగు టైటాన్స్‌

తమిళ్‌ తలైవాస్‌ను తెలుగు టైటాన్స్‌

మొత్తం 12 జట్లు లీగ్‌లో పాల్గొంటున్నాయి. మంగళవారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య తమిళ్‌ తలైవాస్‌ను తెలుగు టైటాన్స్‌ ఎదుర్కొంటుంది. కొచ్చిలో ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు జరగనుండగా... జనవరి 5న ముంబైలో ఫైనల్‌ నిర్వహిస్తారు. ఐదు సీజన్లలో గత మూడు సార్లు వరుసగా పట్నా పైరేట్స్‌ విజేతగా నిలవడం విశేషం. ఆదివారం జరిగే ప్రారంభ కార్యక్రమంలో శ్రుతి హాసన్‌ షో ప్రధాన ఆకర్షణ కానుండగా...మరో తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి కూడా ఇందులో పాల్గొననున్నాడు.

ఎన్నికల నేపథ్యంలో మ్యాచ్‌లను వైజాగ్‌కు

ఎన్నికల నేపథ్యంలో మ్యాచ్‌లను వైజాగ్‌కు

ఆరో సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ను మొత్తం 13 వేదికల్లో నిర్వహిస్తారు. 12 టీమ్‌ల సొంత వేదికలతో పాటు జట్టు లేకపోయినా కేరళలో కబడ్డీని ప్రమోట్‌ చేసేందుకు కొచ్చిలో మ్యాచ్‌లు జరుపుతున్నారు. తెలుగు టైటాన్స్‌ కేంద్రం హైదరాబాద్‌ అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్‌ 7 నుంచి 13 వరకు జరగాల్సిన మ్యాచ్‌లను వైజాగ్‌కు తరలించినట్లు సమాచారం.

పాత జట్లకే కొత్త కెప్టెన్లు:

పాత జట్లకే కొత్త కెప్టెన్లు:

లీగ్‌ వేలంలో భారీ మొత్తాలు పలికిన ఆటగాళ్లపై ఈ సారి అందరి దృష్టి నెలకొంది. హరియాణా స్టీలర్స్‌ తరఫున బరిలోకి దిగుతున్న మోనూ గోయత్‌ అత్యధికంగా రూ.1.51 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కోటి దాటిన ఇతర ఆటగాళ్లలో రాహుల్‌ చౌదరి (1.29), దీపక్‌ హుడా (1.15) కూడా ఉన్నారు. సీజన్‌-6లో చాలా జట్లు కెప్టెన్లను మార్చాయి. తెలుగు టైటాన్స్‌కు రాహుల్‌ చౌదరి స్థానంలో విశాల్‌ భరద్వాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యూపీ యోధకు రిషాంక్‌ దేవడిగ, పుణెరి పల్టాన్‌కు గిరీష్‌ ఎర్నాక్‌, దిల్లీ దబాంగ్‌కు జోగీందర్‌ నర్వాల్‌, గుజరాత్‌ ఫార్చ్యున్‌ జెయింట్స్‌కు సునీల్‌ కుమార్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆరో సీజన్‌లో ఆడే జట్లివే..

ఆరో సీజన్‌లో ఆడే జట్లివే..

తెలుగు టైటాన్స్‌, బంగాల్‌ వారియర్స్‌, బెంగళూరు బుల్స్‌, దబాంగ్‌ దిల్లీ, గుజరాత్‌ ఫార్చ్యున్‌జెయింట్స్‌, హరియాణా స్టీలర్స్‌, జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, పట్నా పైరేట్స్‌, పుణెరి పల్టాన్‌, తమిల్‌ తలైవాస్‌, యూపీ యోధ, యు ముంబా

Story first published: Monday, October 8, 2018, 11:46 [IST]
Other articles published on Oct 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X