న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పృథ్వీ షా సలహాలు తీసుకున్న కెప్టెన్.. ఎందుకో తెలుసా?!!

Priyam Garg seeks Prithvi Shaws advice for U-19 World Cup

బెంగళూరు: ఉత్తర ప్రదేశ్ బ్యాట్స్‌మన్, భారత అండర్‌-19 కెప్టెన్ ప్రియమ్‌ గార్గ్‌ టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా సలహాలు తీసుకున్నాడు. ప్రపంచకప్‌ అండర్‌-19 టైటిల్‌ను నిలబెట్టేందుకు పృథ్వీ షా సలహాలు కోరానని ప్రియమ్‌ గార్గ్‌ తెలిపాడు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు దక్షిణాఫ్రికాలో మెగాటోర్నీ జరగనుంది. అయితే మెగాటోర్నీ కంటే ముందే టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా వెళ్లనుంది.

వెస్టిండీస్ జట్టుకు ఐసీసీ భారీ షాక్.. మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత!!వెస్టిండీస్ జట్టుకు ఐసీసీ భారీ షాక్.. మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత!!

పృథ్వీ షా సలహాలు:

పృథ్వీ షా సలహాలు:

తాజాగా అండర్‌-19 కోచ్‌ పరాస్‌ మహంబ్రే, కెప్టెన్ ప్రియమ్‌ గార్గ్‌ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియమ్‌ గార్గ్‌ మాట్లాడుతూ... 'విరాట్‌ కోహ్లీ సర్‌ను ఇంకా కలవలేదు. పృథ్వీ షాతో మాత్రం మాట్లాడాను. టైటిల్ సాధించాలంటే ప్రణాళిక, ఆటగాళ్ల మధ్య అనుబంధం అత్యంత కీలమని చెప్పాడు. మొదటగా ఆటగాళ్ల బలాలేంటో గుర్తించాలని సూచించాడు. 2018లో ప్రపంచకప్‌ గెలవడంలో ఆటగాళ్ల మధ్య అనుబంధమే కీలక పాత్ర పోషించిందనని చెప్పాడు' అని ప్రియమ్‌ గార్గ్‌ తెలిపాడు.

మాపై ఒత్తిడేమీ లేదు:

మాపై ఒత్తిడేమీ లేదు:

'ఫెండింగ్‌ ఛాంపియన్లుగా ఉన్న మాపై ఒత్తిడేమీ లేదు. అంతపెద్ద టోర్నీలో జట్టుకు సారథ్యం వహించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు అందరం కలిసి చాలా టోర్నీల్లో ఆడాం. సారథిగా జట్టును ముందుకు తీసుకెళ్లడం, కఠిన పరిస్థితుల్లో నడిపించడం గురించి ఆలోచిస్తున్నా. మంచి ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం' అని ప్రియమ్‌ గార్గ్‌ పేర్కొన్నాడు.

జట్టు సమతూకంగా ఉంది:

జట్టు సమతూకంగా ఉంది:

ప్రస్తుత జట్టులో కావాల్సినంత సమతూకం ఉందని కోచ్‌ పరాస్‌ మహంబ్రే అన్నాడు. 'సన్నాహక మ్యాచుల్లో కూర్పుపై ప్రయోగాలు చేస్తాం. జట్టులో బలమైన బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు. కఠిన పరిస్థితుల్లో అందరూ రాణించగలరు. జట్టు సమతూకంగా ఉంది. మెం కచ్చితంగా టైటిల్ సాధిస్తాం' అని మహంబ్రే ధీమా వ్యక్తం చేసాడు. అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ వర్మకి చోటు దక్కింది. తిలక్‌ జట్టులో ప్రముఖ బ్యాట్స్‌మన్‌గా కొనసాగనున్నాడు.

భారత జట్టు:

భారత జట్టు:

ప్రియమ్‌ గార్గ్‌ (కెప్టెన్‌), ధ్రువ్‌ చంద్‌ జురెల్‌ (వైస్‌ కెప్టెన్‌, కీపర్‌), యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, దివ్యాన్ష్‌ సక్సేనా, శషావత్‌ రావత్‌, దివ్యాన్ష్‌ జోషి, శుభంగే హెగ్డే, రవి బిష్నోయ్‌, ఆకాశ్‌ సింగ్‌, కార్తిక్‌ త్యాగి, అథర్వ అంకోలేకర్‌, కుమాల్ కుషాగ్ర, సుశాంత్‌ మిశ్రా, విద్యాధర్‌ పాటిల్‌.

Story first published: Tuesday, December 17, 2019, 11:48 [IST]
Other articles published on Dec 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X