న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఎప్పుడూ ధోనీ సర్‌‌ను ఫాలో అవుతా.. ఆయన వీడియోలు చూసి చాలా నేర్చుకున్నా'

Priyam Garg says I follow MS Dhoni sir, he is my idol and inspiration

ఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అండర్‌ 19 సారథి ప్రియమ్ ‌గార్గ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఎలాంటి ఒత్తిడి పరిస్థితుల్లోనైనా మహీ జట్టును ముందుండి నడిపిస్తాడన్నాడు. ఎలాంటి సందర్భంలో అయినా ప్రశాంతంగా ఉండి, పరిస్థితులకు తగ్గట్టు ఆడటం ఆయనకే చెల్లిందని ప్రియమ్ తెలిపాడు. ధోనీ సర్ తనకు ఆదర్శమని, ఎప్పటికీ అతడినే అనుసరిస్తానని భారత అండర్‌-19 సారథి చెప్పాడు. ధోనీ వీడియోలు చూస్తూ క్లిష్ట సమయాల్లోనూ ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నానన్నాడు.

ధోనీ సర్‌‌ను అనుసరిస్తా

ధోనీ సర్‌‌ను అనుసరిస్తా

తాజాగా ప్రియమ్ ‌గార్గ్‌ మాట్లాడుతూ... ‘నేనెప్పుడూ ధోనీ సర్‌‌ను అనుసరిస్తాను. ఆయన నాకు స్ఫూర్తిప్రదాత, ఆదర్శప్రాయుడు. బ్యాటింగ్‌, కెప్టెన్సీ విషయాల్లో ఆయన అడుగుజాడల్లో నడుస్తా. ఎలాంటి సందర్భంలో అయినా ప్రశాంతంగా ఉండి, పరిస్థితులకు తగ్గట్టు ఆడటం ఆయన నుంచే నేర్చుకున్నా. తన బ్యాటింగ్‌తో పాటు మ్యాచ్‌ను మలుపు తిప్పే కెప్టెన్సీ నిర్ణయాలు, ఫీల్డింగ్‌ సెట్‌ చేయడం లాంటి వీడియోలు చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా ధోనీ కెప్టెన్సీ వల్ల మలుపు తిరిగిన మ్యాచ్‌లను పదేపదే చూస్తా' అని చెప్పాడు.

ఆ ఇన్నింగ్స్‌ చాలా ఇష్టం

ఆ ఇన్నింగ్స్‌ చాలా ఇష్టం

ఎంఎస్ ధోనీ చాలా సందర్భాల్లో జట్టును ఒంటి చేత్తో ఆదుకున్నాడని, ప్రధాన బ్యాట్స్‌మన్‌ ఔటైన ప్రతీసారి ఆ బాధ్యత తనమీద వేసుకొని జట్టును నడిపించాడని ప్రియమ్‌ గుర్తుచేసుకున్నాడు. కెరీర్‌ ఆరంభంలో పాకిస్థాన్‌ మీద ధోనీ ఆడిన ఇన్నింగ్స్‌ తనకు చాలా ఇష్టమని తెలిపాడు. ధోనీని అభిమానించి, ఆరాధించే క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. పాకిస్థాన్ టీమ్‌లోనూ ఉన్నారు. ఇక యువ క్రికెటర్ల సంగతైతే చెప్పనక్కర్లేదు. ధోనీ అడుగు జాడల్లో పయనిస్తూ ఇప్పటికే రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ లాంటి యువ వికెట్ కీపర్లు వెలుగులోకి వచ్చారు.

ఆటగాళ్లు హద్దులు మీరినా

ఆటగాళ్లు హద్దులు మీరినా

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌‌లో భారత్ జట్టుని కెప్టెన్‌గా నడిపించిన ప్రియమ్ గార్గ్‌.. జట్టుని ఏకంగా ఫైనల్‌కి చేర్చాడు. ధోనీ తరహాలో టోర్నీ సాంతం కూల్‌గా కనిపించిన ప్రియమ్.. ఫైనల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు హద్దులు మీరినా సహనం కోల్పోలేదు. ఆటగాళ్లను సముదాయించాడు. అయితే ఫైనల్లో మాత్రం భారత్ ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో రూ.1.9 కోట్లకి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

'ఈసారి వార్నర్‌, స్మిత్‌ ఉన్నా.. మన పేసర్లు వాళ్లకు చుక్కలు చూపిస్తారు'

Story first published: Friday, July 17, 2020, 13:46 [IST]
Other articles published on Jul 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X