న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పృథ్వీ షా తదుపరి లక్ష్యం ఏంటంటే!: మనసులో మాట వెల్లడి

India vs Westindies 2018 : Prithvi Shaw Open Ups His Future
Prithvi Shaw eyes spot in Indias 2019 World Cup squad after West Indies heroics

హైదరాబాద్: వెస్టిండిస్‌తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఓపెనర్ పృథ్వీ షా... 2019 వరల్డ్ కప్‌లో ఆడాలని ఉందని తన మనసులోని మాటను వెల్లడించాడు. ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరిగే వరల్డ్‌కప్‌తో సహా ప్రతి మ్యాచ్‌లోనూ భారత్‌ను విజేతగా నిలపడమే తన కోరికని పేర్కొన్నాడు.

ఏదైనా సాధ్యమే!: పూర్తిగా మారిపోయిన కోహ్లీ ఫోటోని చూశారా?ఏదైనా సాధ్యమే!: పూర్తిగా మారిపోయిన కోహ్లీ ఫోటోని చూశారా?

రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 154 బంతుల్లో 19 ఫోర్లు సాయంతో 134 పరుగులు చేసిన పృథ్వీ షా.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 103 (70, 33 నాటౌట్) పరుగులు చేశాడు. దీంతో టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ని టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది.

రెండు టెస్టుల్లో కలిపి 237 పరుగులు చేసిన పృథ్వీ షా

రెండు టెస్టుల్లో కలిపి 237 పరుగులు చేసిన పృథ్వీ షా

సీనియర్‌ ఆటగాళ్లు బంతులను అడ్డుకోవడానికే కష్టపడుతున్న తొలి ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా ధైర్యంగా బౌండరీలు బాదాడు. రెండు టెస్టుల్లో కలిపి 237 పరుగులు సాధించాడు. దీంతో అరంగేట్రం సిరీస్‌లోనే టాప్ స్కోరర్‌గా నిలిచిన పృథ్వీ షా‌కి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌' అవార్డు సైతం దక్కించుకున్నాడు.

సంతోషంగా ఉందన్న పృథ్వీ షా

సంతోషంగా ఉందన్న పృథ్వీ షా

విండీస్‌పై టెస్టు సిరిస్ అనంతరం పృథ్వీ షా మాట్లాడుతూ "చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్‌లో విన్నింగ్‌ షాట్‌ బాదడం ప్రత్యేకం. ఇది నా తొలి టెస్టు సిరీస్‌. టీమిండియా 2-0తో గెలవడం, నేను మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికవ్వడం చాలా చాలా ప్రత్యేకం. జట్టులో అందరూ కుటుంబ సభ్యుల్లా ఉంటారు. జూనియర్‌, సీనియర్‌ అన్న తేడా లేదు. ఈ ప్రయాణం గొప్పగా ఉంది" అని చెప్పాడు.

 ప్రస్తుతానికి ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నా

ప్రస్తుతానికి ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నా

"ఇలాగే ముందుకు పోవాలనుకుంటున్నా. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికి ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నా" అని పృథ్వీ షా చెప్పాడు. ఆ తర్వాతి పెద్ద లక్ష్యం ఏమిటన్న ప్రశ్నకు పృథ్వీషా జవాబిచ్చాడు. "ఇదే ఊపు కొనసాగించాలని ఆశిస్తున్నా. వరల్డ్‌కప్‌తో పాటు అన్ని మ్యాచుల్లోనూ భారత్‌ను గెలిపించాలని కోరుకుంటున్నా" అని షా తన మనసులో మాట బయటపెట్టాడు.

 2019 వరల్డ్ కప్ జట్టులో షా చోటు దక్కించుకోవాలంటే

2019 వరల్డ్ కప్ జట్టులో షా చోటు దక్కించుకోవాలంటే

ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లపై వేటు వేసిన సెలక్టర్లు.. వెస్టిండీస్‌తో సిరీస్‌లో 18 ఏళ్ల పృథ్వీ షా‌కి అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డే జట్టుకి టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ కొనసాగుతున్నారు. 2019 వరల్డ్ కప్ జట్టులో షా చోటు దక్కించుకోవాలంటే నవంబరులో జరిగే ఆసీస్ సిరిస్‌లో తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Story first published: Tuesday, October 16, 2018, 10:24 [IST]
Other articles published on Oct 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X