న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత్‌కు మరో సెహ్వాగ్ దొరికేశాడు'

Prithvi Shaw can gave Sehwag-like impact for India: Sanjay Manjrekar

న్యూఢిల్లీ: జట్టులో మార్పులు నేపథ్యంలో టీమిండియాలో చోటు దక్కించుకున్న పృథ్వీ షా.. అరంగ్రేటంతోనే అదరగొట్టేశాడు. తొలి టెస్టులో అద్భుతంగా రాణించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో భారత్ జట్టుకి ఓపెనర్ పృథ్వీ షా రూపంలో మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికినట్లేనని మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

18ఏళ్ల పృథ్వీ షా.. ‘మ్యాన్ ఆఫ్ సిరీస్‌'గా

18ఏళ్ల పృథ్వీ షా.. ‘మ్యాన్ ఆఫ్ సిరీస్‌'గా

వెస్టిండీస్‌తో ఆదివారం ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో 134, 70, 33 (నాటౌట్‌) పరుగులు చేసిన 18ఏళ్ల పృథ్వీ షా.. ‘మ్యాన్ ఆఫ్ సిరీస్‌'గా ఎంపికైయ్యాడు. అరంగేట్రం సిరీస్ అయినప్పటికీ అతను ఆడిన షాట్లు 22 ఏళ్ల క్రికెటర్‌ని తలపిస్తున్నాయని కొనియాడిన మంజ్రేకర్.. భారత జట్టుకి సెహ్వాగ్ తర్వాత మరో అటాకింగ్ ఓపెనర్‌ దొరికాడని వెల్లడించాడు.

అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్.. అటాకింగ్ బ్యాట్స్‌మెన్ అని

అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్.. అటాకింగ్ బ్యాట్స్‌మెన్ అని

అరంగేట్రం టెస్టులోనే పృథ్వీ షా చాలా అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్ చేశాడు. అతను ఓ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ అని అతను పరుగులు సాధించిన వేగం (99 బంతుల్లోనే సెంచరీ బట్టే అర్థమవుతోంది. అలా అని.. ప్రతి బంతినీ బాదేయాలని అతను చూడట్లేదు. గతి తప్పిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ.. పరుగులు రాబడుతున్నాడు. తొలి టెస్టులోనే పృథ్వీ షా బ్యాక్‌ఫుట్‌పై చక్కగా ఆడటం నన్ను ఆశ్చర్యపరిచింది.

 భారత్‌కి మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికినట్లే

భారత్‌కి మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికినట్లే

ఆఫ్ స్టంప్‌పై పడిన బంతులు కొన్ని అతడి టెక్నిక్‌ని పరీక్షించాయి. వాటితో పాటు షార్ట్ పిచ్‌ బంతుల్నీ కూడా ఆడటాన్ని అతను నేర్చుకుంటే భారత్‌కి మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికినట్లే. టెస్టుల్లో సెహ్వాగ్ దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్లని ఒత్తిడిలోకి నెట్టేవాడు. పృథ్వీ షా‌ కూడా ఆ స్థాయిలో ప్రభావం చూపగలడు.

 సెహ్వాగ్.. సచిన్‌లతో పోల్చద్దంటూ కోహ్లీ

సెహ్వాగ్.. సచిన్‌లతో పోల్చద్దంటూ కోహ్లీ

ఇదిలా ఉంటే పృథ్వీ షాను వీరేందర్ సెహ్వాగ్.. సచిన్‌లతో పోల్చద్దని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. తన ఆటని ఆడనివ్వమని వేరే వాళ్లతో పోల్చి కట్టడి చేయొద్దంటూ పేర్కొన్నాడు. కోహ్లీతో పాటుగా గంగూలీ సైతం పృథ్వీ పై ప్రశంసలు కురిపించి వేరే వాళ్లని అనుకరించొద్దని సూచించాడు.

Story first published: Wednesday, October 17, 2018, 16:41 [IST]
Other articles published on Oct 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X