పూణెతో మ్యాచ్: కోహ్లీని విజయం వరిస్తుందా? (ఫోటోలు)

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు పూణె, బెంగళూరు జట్ల తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన పూణె ఈసారైనా ప్లేఆఫ్‌ చేరాలని ఉవ్విళ్లూరుతోంది.

కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క విజయం కోసం ఎదురు చూపులు చూస్తోంది. ఈ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తున్న బెంగళూరు 5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. పూణె విషయానికి వస్తే ఎనిమిది మ్యాచుల్లో 4 గెలిచి 8 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది.

వరుస ఓటములతో డీలా

వరుస ఓటములతో డీలా

ఒక్క ఓవర్‌లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలిగే సత్తా ఉన్న విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌గేల్‌ లాంటి ఆటగాళ్లు బెంగళూరు జట్టులో ఉన్న ఈ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతోంది. బెంగళూరు ఆటగాళ్లు పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయి కనిపిస్తున్నారు.

బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం

బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం

యువ ఆటగాళ్లు యజువేంద్ర చాహల్‌, పవన్ నేగి, తైమాల్‌ మిల్స్‌ బౌలింగ్‌ పరంగా తమ వంతు కృషి చేస్తున్నా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో విజయం సాధించలేకపోతున్నారు. మిగతా ఐదు మ్యాచ్‌ల్లో బ్యాట్స్ మెన్లు విజృంభిస్తే బెంగళూరు విజయం సాధించే అవకాశాలున్నాయి. డివిలియర్స్‌కి చివరి ఐదు ఓవర్లలో అత్యుత్తమ స్ట్రైక్‌రేట్‌ ఉంది.

పుణెపై 2-1తో బెంగళూరుకు మంచి రికార్డు

పుణెపై 2-1తో బెంగళూరుకు మంచి రికార్డు

కోహ్లీ, గేల్‌ సైతం మునుపటిలా ఆడితే ఆ జట్టు 200 స్కోర్‌ చేయడం ఏమంత కష్టం కాదు. పుణె బౌలర్లలో ఉనాద్కత్‌, తాహిర్‌, ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ నిలకడగా రాణిస్తున్నారు. పుణెపై 2-1తో బెంగళూరుకు మంచి రికార్డు ఉంది. అయితే ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య చిన్నస్వామిలో పూణెతో ఆడిన మ్యాచ్‌లో కోహ్లీ సేన 162 పరుగులను చేధించలేక ఓడిపోయింది.

సమిష్టిగా రాణిస్తోన్న పూణె

సమిష్టిగా రాణిస్తోన్న పూణె

మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఆఖరి బంతికి విజయం సాధించి తర్వాత ముంబైపై పూణె గెలిచింది. ప్రస్తుతం పూణె జట్టు సమిష్టిగా రాణిస్తోంది. ఇక చివరి రెండు మ్యాచ్‌ల్లో స్టీవ్‌స్మిత్‌, ధోనీ, బెన్‌స్టోక్స్‌ చక్కని ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. అయితే పూణె బ్యాటింగ్‌లో మిడిల్ ఆర్డర్ పేలవంగా ఉంది. పూణె జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంలేదు.

Story first published: Saturday, April 29, 2017, 15:02 [IST]
Other articles published on Apr 29, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి