న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రివ్యూ: సెంచూరియన్ వేదికగా భారత్ వర్సెస్ దక్ణిణాఫ్రికా రెండో టెస్టు

Preview, 2nd Test: India look to stay afloat against South Africa

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్‌టౌన్‌లో ఓడిపోయిన టీమిండియా ఇప్పుడు మరో పరీక్షకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలవకపోతే ఇక టెస్ట్ సిరీస్ లో చేతులెత్తేయాల్సిందే. ఇదే దృష్టిలో ఉంచుకున్న టీమిండియా మరింత పట్టుదలతో పోరాడక తప్పదు. ఈ నేపథ్యంలో శనివారం ఆరంభమయ్యే రెండో టెస్టులో దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. సిరీస్‌ ఓడిపోయినా నంబర్‌వన్‌ ర్యాంకుకు ఢోకా ఉండదు. కానీ మరింత పేస్‌, మరింత బౌన్స్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించడానికి సెంచూరియన్‌ పిచ్‌ కాచుకుని ఉంది.

భారత్ ను బ్యాటింగే కాపాడాలి:
బ్యాటింగే భారత్‌కు పెద్ద సమస్య. కేప్‌టౌన్‌లో ఆతిథ్య పేసర్లకు దీటుగా భారత పేసర్లు రాణించినా.. బ్యాట్స్‌మెనే తీవ్రంగా నిరాశపరిచారు. వాళ్లు పోరాడితే తప్ప రెండో టెస్టులో భారత్‌ విజయాన్ని ఆశించలేం. ఓపెనర్లు శుభారంభాన్నివ్వడం కీలకం. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. కెప్టెన్‌ కోహ్లి కూడా నిలబడడం జట్టుకు చాలా అవసరం. లేదంటే మరోసారి ఇబ్బందులు తప్పవు. ఈ మ్యాచ్‌కు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తుది జట్టులో మార్పులు చేసే అవకాశముంది. తొలి టెస్టులో రహానెను కాదని రోహిత్‌ను తీసుకోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

కానీ ఈసారి మార్పులు జరిగినా.. రహానెకు మాత్రం చోటు దక్కకపోవచ్చు. ఓపెనర్‌ ధావన్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌, వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా స్థానంలో పార్థివ్‌ పటేల్‌ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. విదేశాల్లో 19 టెస్టులు ఆడిన ధావన్‌ సగటు 43.72. ఇది కెరీర్‌ సగటు (42.62) కన్నా ఎక్కువ. ఐతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాల్లో మ్యాచ్‌లనే పరిగణనలోకి తీసుకుంటే అతడి సగటు 27.81 మాత్రమే. పైగా కేప్‌టౌన్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ ధావన్‌ పేలవ షాట్లకు ఔటయ్యాడు. అతడితో పోలిస్తే రాహుల్‌కు సాంకేతికంగా మెరుగైన బ్యాట్స్‌మన్‌గా పేరుంది. ఇక పార్థివ్‌ పటేల్‌.. సాహా కన్నా మెరుగైన బ్యాట్స్‌మన్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. పిచ్‌ స్వింగ్‌కు అంతగా అనుకూలించకపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో భువనేశ్వర్‌ స్థానంలో ఇషాంత్‌ శర్మను తీసుకునే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.

మేమే గెలుస్తాం:దక్షిణాఫ్రికా
మరోవైపు దక్షిణాఫ్రికా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టు జోరునే కొనసాగించాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. పేస్‌ బౌలర్‌ స్టెయిన్‌ గాయంతో దూరమైనా.. మిగతా పేసర్లు భీకరమైన ఫామ్‌లో ఉండడంతో ఆ జట్టుకు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నట్లుగా ధీమాగా ఉంది. మోర్నీ మోర్కెల్‌, ఫిలాండర్‌, రబాడ మరోసారి విజృంభిస్తారనే ధీమాతో దక్షిణాఫ్రికా ఉంది.

యువ పేసర్‌ లుంగి ఎంగిడి రేసులో ఉన్నా స్టెయిన్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ జట్టులోకి వచ్చే అవకాశముంది. అనుభవజ్ఞులైన ఆమ్లా, డివిలియర్స్‌, డుప్లెసిస్‌, డికాక్‌లతో దక్షిణాఫ్రికా లైనప్‌ బలంగా ఉంది.
బౌన్స్‌ రమ్మంటోంది: మ్యాచ్‌ వేదిక సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌ (సెంచూరియన్‌)లోని పిచ్‌ సాధారణంగా మంచి పేస్‌, బౌన్స్‌కు సహకరిస్తుంది. ఐతే ప్రస్తుతానికి పిచ్‌ అంత పచ్చగా లేదు. బౌన్స్‌లో ఏమాత్రం తేడా ఉండదు. వర్షం వల్ల ఎలాంటి అంతరాయం ఉండదు.

తుది జట్లు( అంచనా)
భారత్‌: కె.ఎల్‌.రాహుల్‌, మురళీ విజయ్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, అశ్విన్‌, హార్దిక్‌ పాండ్య, వృద్ధిమాన్‌ సాహా/పార్థివ్‌, భువనేశ్వర్‌/ఇషాంత్‌, మహ్మద్‌ షమి, జస్‌ప్రీత్‌ బుమ్రా
దక్షిణాఫ్రికా: డీన్‌ ఎల్గర్‌, ఐడెన్‌ మార్‌క్రమ్‌, హషీమ్‌ ఆమ్లా, డివిలియర్స్‌, ఫా డుప్లెసిస్‌, క్వింటన్‌ డికాక్‌, వెర్నాన్‌ ఫిలాండర్‌, క్రిస్‌ మోరిస్‌, కేశవ్‌ మహారాజ్‌, కాగిసో రబాడ, మోర్నీ మోర్కెల్‌

Story first published: Saturday, January 13, 2018, 9:21 [IST]
Other articles published on Jan 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X