న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆస్ట్రేలియా పర్యటనకు అదే వ్యూహంతో సిద్ధమవుతున్నాం'

India vs Australia : Team India Game Plan Against Australia | Oneindia Telugu
Preparing for Australia tour by watching videos: Mohammed Shami

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటన అనంతరం టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో తలపడి విజయం సాధించింది. మళ్లీ విదేశీ పర్యటన చేయనున్న భారత్ ఈ సారి ఆస్ట్రేలియాలో నవంబరు 21 నుంచి పోరాటానికి సై అంటోంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పర్యటనలో వైఫల్యాన్ని కొనసాగిస్తుందా.. స్వదేశంలో సాధించిన విజయోత్సాహంతో ఆస్ట్రేలియా గడ్డపై పుంజుకుంటుందా అనే ఉత్కంఠలో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఆసీస్‌పైన కూడా అదే జోరు కొనసాగిస్తుందని

ఆసీస్‌పైన కూడా అదే జోరు కొనసాగిస్తుందని

ఈ నేపథ్యంలో విండీస్‌పై మూడు ఫార్మాట్లను దక్కించుకున్న టీమిండియా.. రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్‌పైన కూడా అదే జోరు కొనసాగిస్తుందని ఫాస్ట్‌ బౌలర్ మహ్మద్‌ షమి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో చోటు దక్కించుకని టెస్టు ఫార్మాట్‌లో ఓ స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకున్న షమీ మీడియాతో మాట్లాడాడు.

లైన్‌ అండ్‌ లెంగ్త్‌ రాబట్టడానికి ఇప్పటి నుంచే

లైన్‌ అండ్‌ లెంగ్త్‌ రాబట్టడానికి ఇప్పటి నుంచే

ఫాస్ట్‌ బౌలింగ్‌ యూనిట్‌గా ఇంగ్లాండ్‌ గడ్డపై మెరుగైన ప్రదర్శననే చేశాం. మరి కొద్దిరోజుల్లో మొదలు కానున్న ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లోనూ ఇదే స్థాయి ప్రదర్శనను కొనసాగించాలనుకుంటున్నాం. అక్కడి పిచ్‌లపై లైన్‌ అండ్‌ లెంగ్త్‌ రాబట్టడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేస్తున్నాం. మా వరకు మేమెప్పుడూ మెరుగైన ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తాం. కానీ జయాపజయాలు మాత్రం అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. ఏదేమైనా మ్యాచ్‌లో కచ్చితంగా 100శాతం ప్రదర్శన చేస్తాం.

 స్మిత్, వార్నర్ లు లేకపోవడపంతో బలహీనంగా

స్మిత్, వార్నర్ లు లేకపోవడపంతో బలహీనంగా

ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతోన్న ఆస్ట్రేలియా జట్టు స్మిత్, వార్నర్ లు లేకపోవడపంతో బలహీనంగా కనిపిస్తోంది. ఒకప్పటి ఫామ్‌ను కొనసాగించలేక, ప్రత్యర్థులపై పైచేయి సాధించలేక సతమతమవుతోంది. ఇటీవల పాకిస్తాన్‍‌తో ముగిసిన వన్డేల్లోనూ కేవలం ఒక్క మ్యాచ్ గెలిచి సాధించామనిపించుకుంది. ఆసీస్ ఇలా ఉన్నప్పటికీ ముందుగా అనుకున్న వ్యూహాలనే చివరి వరకు అమలుచేసి విజయం సాధిస్తామని ఫాస్ట్‌ బౌలర్‌

షమీ పేర్కొన్నాడు.

ఎవరు ఫిట్‌గా ఉంటే.. వారే జట్టులోకి

ఎవరు ఫిట్‌గా ఉంటే.. వారే జట్టులోకి

వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో ఆరంభం కానున్న వన్డే ప్రపంచకప్‌ గురించి మాట్లాడుతూ ‘అప్పటికి ఎవరు ఫిట్‌గా ఉంటారో వారే జట్టులో చోటు దక్కించుకుంటారు. మెరుగైన ప్రదర్శన చేస్తూ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో ఉంటే.. అప్పుడు జట్టులో నా చోటు గురించి ఆలోచిస్తా. అయినా ప్రపంచకప్‌కు చాలా సమయం ఉంది. ఆసీస్‌‌తో టెస్టు సిరీస్‌పైనే ప్రస్తుతం నా దృష్టి కేంద్రీకరించా'అంటూ షమి వెల్లడించాడు.

Story first published: Tuesday, November 13, 2018, 13:30 [IST]
Other articles published on Nov 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X