న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ్లోబల్ టీ20లో లీగ్‌: ప్రీతి జింటా జట్టు పేరేంటో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్‌లో ఓ విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన క్యాష్ రిచ్ టోర్నమెంట్. ఈ టీ20 టోర్నమెంట్ బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్‌లో ఓ విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన క్యాష్ రిచ్ టోర్నమెంట్. ఈ టీ20 టోర్నమెంట్ బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. ఐపీఎల్ బాగా సక్సెస్ అవడంతో అదేదారిలో ప్రపంచంలోని మరికొన్ని దేశాలు టీ20 లీగ్‌లను ప్రారంభించాయి.

ఇందుకు ఉదాహరణే బిగ్ బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్. ఈ ఏడాది జూన్‌లో క్రికెట్ దక్షిణాఫ్రికా ఇటువంటి లీగ్‌కే తెరదీసిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ పేరు టీ20 గ్లోబల్ లీగ్. ఈ లీగ్‌లోని ప్రాంఛైజీలను భారత్‌కు చెందిన పలువురు కోనుగోలు చేశారు.

Preity Zinta to own Monarchs in Global T20 league

ఈ లీగ్‌లో కేప్‌టౌన్‌ నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజీని షారుఖ్‌ ఖాన్‌ ఓ ఫ్రాంఛైజీని కొనుగోలు చేశాడు. దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ జేపీ డుమినిని ఈ ఫ్రాంఛైజీ ప్రధాన ఆటగాడిగా తీసుకుంది. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రాంఛైజీకి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సహా యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇదే లీగ్‌లో బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా ఓ ప్రాంఛైజీని కొనుగోలు చేసినట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా ఛీప్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లోర్గత్ తెలిపారు. ఇక, ప్రీతి జింటా కొనుగోలుతో లీగ్‌లోని అన్ని జట్లు కోనుగోలు పూర్తి అయినట్లు ఆయన తెలిపారు.

ప్రీతి జింటా కొనుగోలు చేసిన ప్రాంఛైజీ పేరు స్టెల్లాన్‌బాష్ మోనార్క్స్. ఈ ఫ్రాంఛైజీ నుంచి బ్రిమ్స్‌స్టోన్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వైదొలగడంతో ఆ టీమ్‌ వాటాలను ప్రీతి దక్కించుకుంది. ఈ ప్రాంఛైజీ దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డుప్లెసిస్ ప్రధాన ఆటగాడిగా ఎంచుకుంది. ఈ సందర్భంగా డుప్లెసిస్ మాట్లాడుతూ ప్రీతి జింటాతో కలిసి పనిచేయబోతుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.

క్రికెట్ పట్ల ప్రీతి జింటా ఎంతో మక్కువ చూపిస్తారని, స్ధానికి అభిమానులకు ఈ లీగ్ తప్పక ఆనందాన్ని పంచుతుందని పేర్కొన్నాడు. ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు ఉన్నాయి. డర్బన్‌, బినాని, ప్రిటోరియా, స్టెలెన్‌బాష్‌, బ్లూఫాంటైన్‌, పోర్ట్‌ ఎలిజబెత్‌ కేంద్రాలుగా మిగతా ఆరు ఫ్రాంఛైజీలు లీగ్‌లో పాల్గొంటాయి.

ఈ లీగ్ తొలి సీజన్‌ నవంబర్-డిసెంబర్‌లో ఆరంభం కానుంది. ఇక, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ యాజమాన్య సంస్థ జీఎంఆర్‌ గ్రూప్‌ సైతం గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఓ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది. జొహానెస్‌బర్గ్‌ కేంద్రంగా నడిచే ఫ్రాంఛైజీని ఈ సంస్ధ కొనుగోలు చేసింది. ఈ ప్రాంఛైజీ పేసర్ రబాడను ప్రధాన ఆటగాడిగా ఎంచుకుంది.

గ్లోబల్ టీ20 లీగ్: జట్లు, యజమానులు

1 Benoni Zalmi: Javed Afridi


2 Bloem City Blazers: Sushil Kumar


3 Cape Town Knight Riders: Shah Rukh Khan


4 Durban Qalandars: Rana Fawad


5 Jo'burg Giants: GMR Group


6 Nelson Mandela Bay Stars: Ajay Sethi


7 Pretoria Mavericks: Hermit Sports Ventures


8 Stellenbosch Monarchs: Preity Zinta

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X