ప్రీతి జింతాకి కోపమొచ్చింది.. టీ షర్టులు పంచుతుండగా..

Posted By:
Preity Zinta

హైదరాబాద్: ఉత్కంఠభరితమైన పోరులో కేవలం నాలుగు పరుగుల తేడాతో.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఈ నేపథ్యంలో జట్టు సహయజమాని అయిన ప్రీతి జింతా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎప్పుడూ నవ్వులు రువ్వుతూ.. నిత్యం సంతోషంగా కనిపించే ఆమె జట్టు విజయానికి ఉత్సాహం రెట్టింపు అయి స్టేడియంలోని అభిమానులకు టీ షర్ట్స్ పంచిపెట్టింది.

ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి ఐపీఎల్‌లో కెరీర్‌ బెస్ట్‌ అయిన 79 పరుగులు చేసి.. నాటౌట్‌గా ఉన్నప్పటికీ చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష్యఛేదనలో ధోనీ వీరోచితంగా ఆడుతున్నంతసేపు మైదానంలో ప్రీతి ఒకింత డల్‌గా కనిపించారు.

మొదట క్రిస్ గేల్‌, కేఎల్‌ రాహుల్‌ చెలరేగి ఆడి.. చెన్నైకి 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ తర్వాత ధోనీ ఆటతీరుతో చెన్నై జట్టు లక్ష్యం దిశగా సాగడం ఆమెలో కొంత టెన్షన్‌ రేపినట్టు కనిపించింది. కానీ, చివరకు పంజాబ్ జట్టు గెలుపొందడంతో ప్రీతి ఆనంద డొలికల్లో తేలియాడింది. గెలిచిన అనంతరం ఆమె మైదానంలోని అభిమానులకు కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు టీ షర్ట్‌లను పంచింది.

అదే సమయంలో స్టేడియంలోని ఒక వ్యక్తిపై ఒక్కసారిగా సహనం కోల్పోయినట్టు కనిపించింది. ప్రేక్షకుల్లో కొందరు చేసిన వ్యాఖ్యలు ఆమెకు కోపం తెప్పించాయి. ఒకతను తన గురించి వ్యాఖ్యలు చేయడంతో అతనిపై ప్రీతి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపంతో అతన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో.. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం నడిచింది. కాసేపటికి నార్మల్ అయిపోయిన ప్రీతి మళ్లీ యథావిధిగా అభిమానులకు టీషర్ట్‌లు పంచింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 17, 2018, 17:29 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి