న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారిద్దరూ విజయాలను అందించగల సమర్థులు.. సమన్వయం చేసుకుని ఆడాలి: ఓజా

Pragyan Ojha says Ravichandran Ashwin, Ravindra Jadeja should play together in WTC final

హైదరాబాద్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో అవకాశం దక్కితే.. ఇద్దరూ సమన్వయం చేసుకుని ఆడాలని భారత మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా సూచించాడు. ఎంతో అనుభవం ఉన్న ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎలాంటి వికెట్‌ మీదనైనా వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాబట్టి జట్టుకు విజయాలను అందించగలరని ఓజా పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లో కొన్నాళ్లుగా ఈ స్పిన్ ద్వయం ప్రత్యర్థి జట్ల బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీయడంలో కీలకపాత్ర పోషిస్తోందన్నాడు.

ప్రగ్యాన్ ఓజా స్పోర్ట్స్ టుడేతో జరిగిన ఓ ప్రత్యేక చాట్‌లో టీమిండియా స్పిన్ బౌలింగ్ విభాగంపై స్పందించాడు. 'రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరు తుది జట్టులో ఆడాలి. ఇద్దరూ బ్యాటింగ్ చేయడంతో పాటు ఎలాంటి పిచ్‌ల మీదనైనా మంచి బౌలింగ్ ప్రదర్శన చేస్తారు. జడేజాకు దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. అతడు మూడు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. అశ్విన్‌ కూడా పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. ఈ ఇద్దరి స్పిన్నర్లకు తుది జట్టులో ఆడే అవకాశం వస్తే సమన్వయం చేసుకుని ఆడాలి. అనుభవజ్ఞులైన వీరిద్దరూ ఎలాంటి వికెట్‌ మీదనైనా విజయాలను అందించగల సమర్థులు' అని అన్నాడు.

సారీ.. నీకు హెల్ప్ చేయను! నీకొచ్చింది కరోనా కాదు.. ఇంకో మాయదారి రోగం: హనుమ విహారిసారీ.. నీకు హెల్ప్ చేయను! నీకొచ్చింది కరోనా కాదు.. ఇంకో మాయదారి రోగం: హనుమ విహారి

'ఛాంపియన్‌ షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టు బాగుంది. అందరికి విదేశాల్లో ఆడిన అనుభవం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. మొత్తంమీద ఇది అద్భుతమైన జట్టు. గత కొంత కాలంగా హనుమ విహారి ఆటను పరిశిలీస్తున్నా. ఇంగ్లండ్ గడ్డపై కౌంటీ క్రికెట్‌ ఆడడం చూస్తే.. అతనికి ఆటపై ఎంత శ్రద్ద ఉందో తెలుస్తుంది. ఆ అనుభవం కచ్చితంగా జట్టుకు పనికొస్తుంది. ఆ విషయం అందరికి తెలుసు' అని ప్రగ్యాన్ ఓజా పేర్కొన్నాడు.

భారత టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.
స్టాండ్‌బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్ క్రిష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా.

Story first published: Wednesday, May 12, 2021, 9:53 [IST]
Other articles published on May 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X