న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ప్రజ్ఞాన్‌ ఓజా!!

Pragyan Ojha announces retirement from all forms of cricket

భువనేశ్వర్‌: అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు టీమిండియా వెటరన్‌ లెఫ్మార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా శుక్రవారం ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు కూడా వీడ్కోలు చెబుతున్నట్లు ఓజా ప్రకటించారు. ఈ మేరకు ఈ ప్రజ్ఞాన్‌ ఓజా తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు. దీంతో 16 సంవత్సరాల ప్రొఫెషనల్ క్రికెట్‌కు తెరపడింది.

టీ20 ప్రపంచకప్‌: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. ముగ్గురు స్పిన్నర్లతో భారత్టీ20 ప్రపంచకప్‌: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. ముగ్గురు స్పిన్నర్లతో భారత్

ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి:

ప్రజ్ఞాన్‌ ఓజా తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఇలా రాసుకొచ్చారు... 'నేను నా జీవితంలో తరువాతి దశకు వెళ్ళే సమయం వచ్చింది. నా కెరీర్‌ గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇదే తగిన సమయం. కెరీర్‌ ఎదుగుదలకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రతి వ్యక్తి యొక్క ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి. అవి నన్ను ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తాయి' అని సుదీర్ఘ సందేశం పోస్ట్ చేసారు.

ఆ కల నెరవేరింది:

ఆ కల నెరవేరింది:

'నేను తీసుకున్న వీడ్కోలు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి వైదొలిగేందుకు ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. భారత క్రికెటర్‌గా ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అత్యంత గౌరవం. భారత్‌ క్రికెట్‌ జట్టుకు ఆడాలని చిన్నప్పట్నుంచి కలలు కనేవాడిని, అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది' అని ప్రజ్ఞాన్‌ ఓజా అన్నారు.

 2013లో చివరి మ్యాచ్:

2013లో చివరి మ్యాచ్:

2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్రజ్ఞాన్‌ ఓజా 16 సంవత్సరాలు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడారు. అయితే 2013 నుండి అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినప్పటికీ.. 2019 వరకు దేశీయ క్రికెట్ ఆడారు. ఓజా భారత్‌ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడారు. టెస్టుల్లో 113 వికెట్లు.. వన్డేల్లో 21 వికెట్లు, టీ20ల్లో10 వికెట్లను ఖాతాలో వేసుకున్నారు. 2013లో ముంబైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 33 ఏళ్ల ఓజా చివరిసారిగా భారత్ తరఫున ఆడారు. ఈ మ్యాచ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వీడ్కోలు టెస్ట్ మ్యాచ్.

బౌలింగ్‌ యాక్షన్‌పై అనుమానాలు:

బౌలింగ్‌ యాక్షన్‌పై అనుమానాలు:

ఐపీఎల్‌లో డెక్కన్‌ చార్జర్స్‌, ముంబై ఇండియన్స్‌ తరఫున ప్రజ్ఞాన్‌ ఓజా ఆడారు. 2014లో ఓజా బౌలింగ్‌ యాక్షన్‌పై అనుమానాలు వచ్చినా.. 2015లో క్లియరెన్స్‌ లభించింది. 2018లో బిహార్‌ తరఫున తన చివరి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడారు. అప్పట్నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఓజా.. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని తాజాగా ప్రకటించారు.

Story first published: Friday, February 21, 2020, 14:22 [IST]
Other articles published on Feb 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X