న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏడాది నిషేధం: స్మిత్, వార్నర్‌కు కలిగిన ఆర్ధిక నష్టం ఎంతో తెలుసా?

By Nageshwara Rao
Post their ban, Smith stands to lose Rs 22.9 crore and Warner Rs 19.4 crore

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ బ్రాడ్‌మన్‌లా ఎదుగాల్సిన వాడు బ్యాడ్‌మన్ అయ్యాడు. కెప్టెన్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ భవిష్యత్తుని ఎక్కడికో తీసకుళ్తాడని అనుకుంటే దేశం పరువు తీశాడు. గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతామనే సంకేతాలిచ్చి.. కేప్‍‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో బాల్ టాంపరింగ్‌కు పాల్పడి తగిన మూల్యం చెల్లించుకున్నారు.

అంతేకాదు క్రికెట్ ప్రపంచ ముందు దోషిగా నిల్చున్నారు. గెలుపును నిజాయితీగా అందుకోవాలి తప్పితే అందుకు అడ్డదారులు తొక్కితే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిపేందుకు ఆసీస్‌ క్రికెటర్లు స్మిత్‌, వార్నర్‌ బాల్ టాంపరింగ్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. బాల్ టాంపరింగ్ ఘటనలో స్మిత్, వార్నర్‌పై సీఏ ఏడాది పాటు నిషేధం విధించింది.

సీనియర్ల సూచన మేరకు బాల్ టాంపరింగ్‌కు యత్నించిన బాన్‌క్రాప్ట్‌పై 9 నెలలు నిషేధం విధించింది. తమ ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనలను అతిక్రమించినందుకు స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై చర్యలు తీసుకున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. తమ సిగ్గుమాలిన చర్యతో స్మిత్, వార్నర్‌లు ఆర్ధికంగా కూడా నష్టపోనున్నారు.

Post their ban, Smith stands to lose Rs 22.9 crore and Warner Rs 19.4 crore

క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఇచ్చే సెంట్రల్ కాంట్రాక్టు ద్వారా లభించే మొత్తాలతోపాటు, ఐపీఎల్‌ కాంట్రాక్టు ద్వారా చేకూరే కళ్లు చెదిరే మొత్తాన్ని కోల్పోనున్నారు. వీరిద్దరూ పలు కార్పోరేట్ బ్రాండ్‌లకూ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థలు కనుక స్మిత్‌, వార్నర్‌లతో కాంట్రాక్టులను రద్దు చేసుకొంటే పెద్ద మొత్తంలో నష్టపోనున్నారు.

ఇప్పటికే నాలుగేళ్లుగా స్పాన్సర్‌గా ఉన్న ఎల్‌జీ కూడా వార్నర్‌తో కాంట్రాక్ట్‌ను పొడగించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం వార్నర్‌తో ఎల్‌జీ స్పాన్సర్‌షిప్ చివరి దశలో ఉంది. మరికొన్ని వారాల్లో అది ముగియనుంది. అయితే, ఈ బాల్ టాంపరింగ్ ఉదంతం వల్ల కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించకూడదని నిర్ణయించామని ఎల్‌జీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో చెప్పారు.

వార్నర్‌కు సైతం ఆర్ధికంగా పెద్ద దెబ్బ:
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది కాంట్రాక్టు కింద వార్నర్‌కు రూ. మూడున్నర కోట్లకు పైగా జీతం లభించనుంది. దీనికి మ్యాచ్‌ ఫీజులు అదనం. స్మిత్‌తో సమానంగా అతడు ఒక్కో మ్యాచ్‌కు పారితోషికం అందుకోనున్నాడు. తాజా నిషేధంతో వార్నర్‌ ఈ ఏడాది మొత్తం 48 మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. తద్వారా రూ. 19.4 కోట్లకు పైగానే నష్టపోనున్నాడు.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్ అయిన డేవిడ్‌ వార్రన్‌ను ఆ జట్టు రూ. 12.50 కోట్లకు కొనుగోలు చేసింది.

స్మిత్‌కు ఎంత నష్టం అంటే:
2017-18 సీజన్‌కు గాను సెంట్రల్‌ కాంట్రాక్టు కింద క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నుంచి స్మిత్‌కు దాదాపు రూ. ఏడు కోట్లు జీతం లభించనుంది. దీనికి ఒక్కో మ్యాచ్‌కు చెల్లించే మొత్తం అదనం. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం స్మిత్‌కు బోనస్‌ కూడా లభిస్తుంది. ఒక్కో టెస్టుకు రూ. తొమ్మిది లక్షలు, వన్డేకు రూ. 4.5 లక్షలు, టీ20లకు రూ. 3.68 లక్షలు స్మిత్‌ అందుకోనున్నాడు. నిషేధం కారణంగా ఈ ఏడాది స్మిత్ 12 టెస్ట్‌లు, 29 వన్డేలు, 7 టీ20లకు దూరం కానున్నాడు. ఈ మొత్తం దాదాపు రూ. 22.9కోట్లుగా ఉండనుంది. దీనికి తోడు ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ స్మిత్‌ను రూ. 12.50 కోట్లకు కొనుగోలు చేసింది.


CRICKETING ACTION


IPL: April-May 2018


Tour of England (5 ODIs. 1 T20I): June 2018


Tour of Zimbabwe (1 Test. 3 ODIs): June-July 2018


Bangladesh in Australia (2 Tests. 3 ODIs): August-September 2018


Series against Pakistan in UAE (5 ODIs, 1 T20I): October 2018


SA in Australia (5 ODIs. 3 T20Is): October-November 2018


India in Australia (4 Tests): November 2018-January 2019


Sri Lanka in Australia (2 Tests. 3 T20Is): January 2019


New Zealand in Australia (TBA): February 2019


Australia in India (5 ODIs. 2 T20Is): February 2019


Series against Pakistan (3 Tests): March 2019


DRAINING BANK BALANCE (Approx. Figures)


Match fees

Smith: Rs 2.9 crore

Warner: Rs 2.9 crore


Central Contract

Smith: Rs 7.5 crore

Warner: Rs 4 crore


IPL

Smith: Rs 12.5 crore

Warner: Rs 12.5 crore


TOTAL

Smith: Rs 22.9 crore

Warner: Rs 19.4 crore


Story first published: Thursday, March 29, 2018, 11:05 [IST]
Other articles published on Mar 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X