అరుదైన ఘనత: 18 ఏళ్ల ప్రపంచ రికార్డుని బద్దలు కొట్టిన భారత క్రికెటర్

Posted By:
Pooja Vastrakar

హైదరాబాద్: ఐసీసీ ఉమెన్‌ చాంపియన్‌షి‌ప్‌లో భాగంగా వడోదర వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్‌ పూజా వస్త్రాకర్ అరుదైన రికార్డును సాధించింది. ఆసీస్‌తో వన్డేలో హాఫ్‌ సెంచరీతో రాణించిన పూజా, తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది.

దీంతో న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌ దూలాన్‌ పేరిట ఉన్న రికార్డును పూజా వస్త్రాకర్‌ బద్దలు కొట్టింది. 2009లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దులాన్‌ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌ చేసి 48 పరుగులు సాధించింది. కాగా, ఇది వస్త్రాకర్‌కు తొలి వన్డే హాఫ్‌ సెంచరీ కావడం గమనార్హం. దీంతో తొలి వన్డేలో హాఫ్‌ సెంచరీ చేసిన పిన్న వయసు భారత క్రీడాకారిణుల్లో వస్త్రాకర్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

18 ఏళ్ల 168 రోజుల వయసులో వస్త్రాకర్‌ ఈ ఘనత సాధించింది. అంతకుముందు ఈ జాబితాలో తిరుషా కామిని, మిథాలీ రాజ్‌, స్మృతీ మంధానాలు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ 200 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం భారత మహిళల జట్టు నిర్దేశించిన 201 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 32.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్‌ బోల్టన్‌ (100 నాటౌట్; 101 బంతుల్లో 12 ఫోర్లు) పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టోర్నీలో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ గురువారం జరగనుంది.

తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీ చేసిన మహిళా క్రికెటర్లు:

* Pooja Vastrakar (India) - 51 vs Australia, March 12, 2018
* Lucy Doolan (New Zealand) - 48 vs England, March 22, 2009
* Jhulan Goswami (India) - 43* vs South Africa, July 8, 2017
* Y van der Merwe (South Africa) - 42* vs India, November 30, 2000
* Rene Farrell (Australia) - 39* vs England, June 29, 2009
* Shanel Daley (West Indies) - 38* vs South Africa, October 18, 2009
* P Thomas (West Indies) - 38 vs India, March 3, 2004
* D Small (West Indies) - 37* vs Sri Lanka, November 9, 2008
* Rachel Priest (New Zealand) - 36 vs Ireland, July 4, 2010
* Laura Marsh (England) - 36* vs Sri Lanka, November 17, 2016

Story first published: Monday, March 12, 2018, 22:29 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి