న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనాపై పోరు కోసం.. 40 మంది క్రీడా ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌!!

PM Narendra Modi holds video conference with eminent sports personalities
PM Modi Step Behind Video Conferencing With Sports Persons

ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) చాలా వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. భారత్‌లోనూ కరోనా రోజురోజుకు పంజా విసురుతోంది. దేశంలో ఇప్పటికే కరోనా బారిన సంఖ్య 2000లకుపైగా చేరగా.. మృతుల సంఖ్య 50పైగా ఉంది. దేశంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. అక్కడితో ఆగకుండా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు మోదీ వివిధ రంగాల ప్రముఖులతో సమాలోచనలు జరుపుతున్నారు.

కోహ్లీ లైవ్‌చాట్‌ను అడ్డుకున్న బాలీవుడ్ భామ.. ఎందుకో తెలుసా?!!కోహ్లీ లైవ్‌చాట్‌ను అడ్డుకున్న బాలీవుడ్ భామ.. ఎందుకో తెలుసా?!!

క్రీడా ప్రముఖులతో మోదీ వీడియా కాన్ఫరెన్స్‌:

క్రీడా ప్రముఖులతో మోదీ వీడియా కాన్ఫరెన్స్‌:

ఈ క్రమంలోనే దేశంలోని పలువురు క్రీడా ప్రముఖులతో ప్రధాని మోదీ శుక్రవారం వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా వివిధ క్రీడలకు సంబంధించిన దాదాపు 40 నుంచి 60 మంది ప్రముఖులతో ప్రధాని చర్చించారని సమాచారం తెలుస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమంలో క్రీడాకారులను కూడా భాగస్వామ్యులను చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ప్రజలును చైతన్య పరచాలని ప్రధాని వారిని కోరారు.

 గంగూలీ, మేరీ, ఆనంద్, వినేష్, నీరజ్, సింధులు:

గంగూలీ, మేరీ, ఆనంద్, వినేష్, నీరజ్, సింధులు:

వీడియా కాన్ఫరెన్స్‌లో ప్రధానితో పాటు క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ, క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, మాజీ పేసర్ జహీర్ ఖాన్, మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్, పీవీ సింధు, నీరజ్ చోప్రా, విశ్వనాథన్ ఆనంద్, హిమా దాస్, మేరీ కోమ్, అమిత్ పంగల్, వినేష్ ఫోగట్, మను భాకర్ లాంటి ఎందరో పాల్గొన్నారు.

 ప్రజల్లో అవగాహన కల్పించాలి:

ప్రజల్లో అవగాహన కల్పించాలి:

వీడియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కొందరి క్రీడాకారులకు కరోనాపై మాట్లాడానికి, వారి అభిప్రాయాలను తెలియజేయడానికి 3 నిమిషాల సమయంను ప్రధాని ఇచ్చారని సమాచారం తెలుస్తోంది. వీడియా కాన్ఫరెన్స్‌లో పాల్గొటున్నారా అని ఈ ఉదయం గంగూలీని అడగ్గా.. 'అవును.. ప్రధానితో మాట్లాడబోతున్నా. కానీ ఏ విషయాలు చర్చిస్తామో మీకు చెప్పలేను' అని సమాధానం ఇచ్చారు. సామాజిక దూరం పాటించాలని.. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని క్రీడా ప్రముఖులను ప్రధాని కోరినట్లు సమాచారం.

ఇదే తొలిసారి:

ఇదే తొలిసారి:

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీతో సమావేశం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితం కావడంతో.. సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక కరోనాపై పోరుకు పెద్ద ఎత్తున విరాళాలు అందించిన క్రీడా, సినీ ప్రముఖులను మోదీ ఇదివరకే అభినందించారు.

Story first published: Friday, April 3, 2020, 13:07 [IST]
Other articles published on Apr 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X