న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిన్ను చూసి దేశం గర్విస్తోంది.. యువతకు నువ్వు స్ఫూర్తి

PM Modi, Sachin Tendulkar Congratulate Hima Das For Dream Run In Europe || Oneindia Telugu
PM Modi, Amitabh Bachchan, Sachin Tendulkar.. Celebs in Awe After Sprinter Hima Das Wins 5th Gold

అసోంకు చెందిన 19 ఏళ్ల అథ్లెట్‌ హిమాదాస్‌ అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. చెక్‌ రిపబ్లిక్‌లో శనివారం జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌లో హిమ దాస్‌ 400 మీటర్ల రేసులో తొలి స్థానంలో నిలిచి పసిడిని సొంతం చేసుకున్నారు. నెల రోజుల వ్యవధిలో ఏకంగా ఐదు స్వర్ణాలు కొల్లగొట్టి భారత్‌ కీర్తి ప్రతిష్ఠలను పెంచింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

ప్రశంసల వర్షం:

సరిగ్గా గత ఏడాది జూలైలో అండర్‌20 వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌లో 400 మీ పరుగులో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన దాస్‌.. సంవత్సరం తిరిగే సరికి ఐదు స్వర్ణాలు సాధించింది. ఐదు అంతర్జాతీయ స్వర్ణాలు సాధించిన హిమదాస్‌పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్, యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెండుల్కర్‌లు కొనియాడారు.

దేశం గర్విస్తోంది:

'గత కొన్ని రోజులుగా అద్భుత విజయాలు సాధిస్తున్న హిమదాస్‌ను చూసి దేశం గర్విస్తోంది. దేశం తరఫున ఐదు అంతర్జాతీయ స్వర్ణాలను సాధించినందుకు అందరూ సంతోషిస్తున్నారు. ఆమెకు అభినందలు. భవిష్యత్తులో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను' అని ప్రధాని ట్వీట్‌ చేశారు.

సలామ్‌ బాస్‌:

'నువ్వు ఒక స్ఫూర్తి. ద గోల్డెన్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇండియా. సలామ్‌ బాస్‌' అని రిషభ్‌ పంత్‌ కొనియాడాడు. 'గత 19 రోజులుగా యూరోపియన్‌ సర్క్యూట్‌లో నీ ప్రదర్శన చూసి గర్విస్తున్నాం. గెలవాలనే పట్టుదల యువతకు ఒక స్ఫూర్తి. ఐదు పతకాలు గెలిచినందుకు అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తున్నా' అని సచిన్‌ ట్వీటారు.

నువ్వు ప్రత్యేకం:

'ఇది నమ్మశక్యం కాని ముగింపు. 400 మీటర్లలో అసాధ్యమైన ఫీట్!. అమేజింగ్.. అమేజింగ్.. అమేజింగ్. హిమదాస్.. నువ్వు ప్రత్యేకం!!' అని అమితాబ్ పేర్కొన్నారు. హిమదాస్‌ పాంజ్‌సన్‌ అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌, కుట్నో అథ్లెటిక్‌ మీట్‌, క్లాడ్నో అథ్లెటిక్‌ మీట్‌, టాబోర్‌ అథ్లెటిక్‌ మీట్‌, చెక్‌ రిపబ్లిక్‌ అథ్లెటిక్స మీట్‌లలో స్వర్ణాలను సాధించింది.

Story first published: Monday, July 22, 2019, 12:47 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X