న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సానియా.... షోయబ్‌కు చెప్పు బ్యాటింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకో అని!

By Nageshwara Rao
Please tell Shoaib to wear helmet, Twitter users ask Sania Mirza

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు క్రికెట్ అభిమానులు ఓ సూచన చేశారు. తన భర్త, పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు హెల్మెట్ పెట్టుకో అని చెప్పు అంటూ సానియా మిర్జాకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు.

అసలేం జరిగింది?
న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా తలకు తగలడంతో పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ మైదానంలో కుప్పకూలిపోయాడు. బాధతో విలవిల్లాడుతున్న షోయబ్‌ మాలిక్‌ను వెంటనే గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లి చికిత్స అందించారు.

హమిల్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 32వ ఓవర్‌లో షాట్ కొట్టి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే బంతి ఫీల్డర్ మున్రో చేతికి చేరడంతో అవతలి ఎండ్‌లో ఉన్న మహమ్మద్ హఫీజ్ వద్దని వారించాడు.

దీంతో మాలిక్ వెనక్కి మళ్లాడు. ఈ క్రమంలో రనౌట్ చేసేందుకు ప్రయత్నించిన మున్రో బంతిని బలంగా వికెట్ల వైపు విసిరాడు. అది కాస్తా మాలిక్ తల వెనకవైపు బలంగా తాకడంతో షోయబ్ మాలిక్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది మాలిక్‌ను గ్రౌండ్ నుంచి తీసుకెళ్లి అతనికి ట్రీట్‌మెంట్ అందించారు.

అనంతరం కోలుకున్న అతను మూడు బంతుల అనంతరం తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే దెబ్బ బలంగా తాకడంతో ఏకాగ్రత కోల్పోయిన షోయబ్ మాలిక్(6) ఆ వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో పాక్‌పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

హెల్మెట్ లేకుండా బ్యాటింగ్
అయితే షోయబ్ మాలిక్ క్రీజులోకి వచ్చే సమయానికి స్పిన్నర్లు బౌలింగ్ చేస్తుండటంతో హెల్మెట్ లేకుండా బరిలోకి దిగాడు. దీంతో హెల్మెట్ లేకపోవడంతో మున్రో విసిరిన బంతి నేరుగా తలకు తగలడంతో పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ మైదానంలో కుప్పకూలిపోయాడు. దీనిపై సానియా మిర్జాకు ట్యాగ్ చేస్తూ షోయబ్ మాలిక్ హెల్మెట్ పెట్టుకో అని చెప్పండంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Story first published: Wednesday, January 17, 2018, 12:38 [IST]
Other articles published on Jan 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X