న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డబ్బుల కోసమే బెయిర్‌స్టో ఐపీఎల్ ఆడుతాడు.. డిక్‌విల్లా స్లెడ్జింగ్‌.. ఆ వెంటనే ఔట్! (వీడియో)

Playing IPL for cash only, Niroshan Dickwella’s sledge against Jonny Bairstow

గాలే: ఇంగ్లండ్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీలంక వికెట్‌కీపర్‌ నిరోషన్‌ డిక్‌విల్లా ఈ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌పై స్లెడ్జింగ్‌‌కు దిగాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్‌తో.. ఇంగ్లండ్‌ తలపడే టెస్టుల్లో బెయిర్‌స్టో ఆడటం లేదని, కానీ ఐపీఎల్‌ ఆడతాడని ఎద్దేవా చేశాడు.

అది కూడా డబ్బు కోసమేనని విమర్శించాడు. గాలే వేదికగా శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో(28) బ్యాటింగ్‌ చేస్తుండగా లంక కీపర్‌ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. అయితే, డిక్‌విల్లా కామెంట్ చేసిన వెంటనే ఏకాగ్రత కోల్పోయిన బెయిర్‌స్టో ఔటవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇంతకేం జరిగిందంటే..?

ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా బెయిర్ స్టో బ్యాటింగ్ చేస్తుండగా అతని ఏకాగ్రతను దెబ్బతీసేందుకు వికెట్ కీపర్ నిరోషన్ డిక్‌విల్లా తన నోటికి పనిచెప్పాడు. 'ఇండియా టూర్ నుంచి విశ్రాంతి. కానీ ఐపీఎల్ మాత్రం ఆడుతాడు. అది కూడా డబ్బుల కోసమే'అని వికెట్ల వెనుకాల నుంచే ఎద్దేవా చేశాడు. లంక స్పిన్నర్ ఎంబుల్దేనియా వేసిన 36 ఓవర్‌ నాలుగో బంతికి ముందు ఇది జరగ్గా.. ఆ వెంటనే బెయిర్ స్టో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. బంతిని డిఫెన్స్ చేయబోయిన బెయిర్ స్టో స్లిప్‌లో చిక్కాడు. తొలుత అంపైర్ నాటౌటివ్వగా రివ్యూకెళ్లి శ్రీలంక ఫలితం రాబట్టింది.

వర్కలోడ్‌తో రెస్ట్..

వర్కలోడ్‌తో రెస్ట్..

ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు నియమాల ప్రకారం ప్రతీ ఆటగాడికి ఏడాదిలో తగినంత విశ్రాంతి ఇవ్వాలి. పనిభారం ఎక్కువ కాకూడదనే ఉద్దేశంతోనే బెయిర్‌స్టోను భారత్‌తో టెస్టు మ్యాచ్‌లకు ఎంపిక చేయలేదు. ఈ ఏడాది ఇంగ్లండ్‌ ఎక్కువ టెస్టులు ఆడాల్సి ఉండడంతో పాటు టీ20 ప్రపంచకప్‌ కూడా ఉండటంతో బెయిర్‌ స్టోకు విశ్రాంతినిచ్చింది. అయితే ఈ నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు కూడా పెదవి విరిచారు.

ఇంగ్లండ్ క్లీన్ స్వీప్

ఇంగ్లండ్ క్లీన్ స్వీప్

ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇంగ్లండ్.. 6 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. శ్రీలంక నిర్దేశించిన 164 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 43.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. డామ్‌ సిబ్లీ (56 నాటౌట్‌), జాస్‌ బట్లర్‌ (46) ఐదో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించి మరో రోజు ఆట మిగిలిఉండగానే జట్టుకు విజయాన్నందించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 339/9తో నాలుగోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌ మరో 5 పరుగులు జోడించి 344 పరుగుల వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో శ్రీలంకకు 37 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

క్రికెట్ చరిత్రలోనే..

క్రికెట్ చరిత్రలోనే..

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంకను ఇంగ్లండ్‌ స్పిన్నర్లు డామ్‌ బెస్‌ (4/49), జాక్‌ లీచ్‌ (4/59), జో రూట్‌ (2/0) దెబ్బతీశారు. ఈ ముగ్గురి ధాటికి లంక 35.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు ఇంగ్లండ్‌ పేసర్లు తీయగా... రెండో ఇన్నింగ్స్‌లోని 10 వికెట్లను స్పిన్నర్లు తీయడం విశేషం. క్రికెట్ చరిత్రలోనే ఇలా ఓ ఇన్నింగ్స్‌లో పేసర్లు, మరో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు పదేసి వికెట్లు తీయం తొలిసారి. ఇక అజేయశతంకంతో పాటు హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'తో పాటు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌'అవార్డులు లభించాయి.

పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!

Story first published: Tuesday, January 26, 2021, 11:54 [IST]
Other articles published on Jan 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X