న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదుసార్లుకు పైగా వరల్డ్‌కప్‌కు ప్రాతినిథ్యం: అగ్రస్థానం సచిన్‌దే

Players who have appeared in at least five World Cups in Cricket

హైదరాబాద్: తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న దేశానికి వరల్డ్‌కప్ సాధించిపెట్టాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనున్న ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. వరల్డ్‌కప్‌లో ఆడబోయే భారత జట్టుపై సెలక్టర్లు ఇప్పటికే స్పష్టతకు వచ్చారు. వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నీలో దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఎంతో గొప్ప.

<strong>India vs Australia 2nd T20I: సిరిస్ సమం చేసేనా లేక ఓటమా?</strong>India vs Australia 2nd T20I: సిరిస్ సమం చేసేనా లేక ఓటమా?

ఈ ఏడాది జరగనున్న వరల్డ్‌కప్ పలువురు భారత ఆటగాళ్లు కొత్త కాగా, మరికొందరికి ఇప్పటికే వరల్డ్‌కప్‌లో ఆడారు. వరల్డ్‌కప్ లాంటి మెగాటోర్నీలో భారత్ తరపున అత్యధిక సార్లు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. మొత్తంగా ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు పాల్గొన్న క్రికెటర్లను ఒక్కసారి చూద్దామా...

సచిన్ టెండూల్కర్ - ఇండియా

సచిన్ టెండూల్కర్ - ఇండియా

భారత్ తరుపున ఆరు సార్లు వరల్డ్‌‌కప్‌‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1992 నుంచి 1996, 1999, 2003, 2007, 2011 దాకా ప్రతీ వరల్డ్‌కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 45 మ్యాచ్‌లలో 2278 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒక టోర్నీలో చేసిన అత్యధిక పరుగులు 673 (2003 సంవత్సరంలో). వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు (6) సాధించిన ఆటగాడిగా కూడా సచిన్ రికార్డు సృష్టించాడు. టోర్నీలో నమీబియాపైన సాధించిన 152 పరుగులే వరల్డ్ కప్‌లో సచిన్ సాధించిన అత్యధిక పరుగులు. 25 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి 8 వికెట్లు తీశాడు. కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో 2/28 సచిన్ అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు. సచిన్ చేసిన 2,278 పరుగులు ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో ఒక బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక పరుగులు.

జావెద్ మియాందాద్ - పాకిస్థాన్

జావెద్ మియాందాద్ - పాకిస్థాన్

పాక్ తరుపున ఆరు సార్లు వరల్డ్ కప్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 1975 నుంచి 1979,1983,1987,1992, 1996 వరకు ఆరు టోర్నీల్లోనూ మియాందాద్ పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 33 మ్యాచ్‌ల్లో 1083 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసి 4 వికెట్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

అర్జున రణతుంగ

అర్జున రణతుంగ

శ్రీలంక తరపున అర్జున రణతుంగ, అరవింద డిసిల్వా, సనత్ జయసూర్య, ముత్తయ్య మురళీధరన్, మహేల జయవర్ధనే ఐదు సార్లు వరల్డ్‌కప్‌లో ప్రాతినిధ్యం వహించారు.

ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ నుంచి ఐదు సార్లు వరల్డ్ కప్ ఆడిన ఆటగాళ్లలో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రం, ఇంజమామ్ ఉల్ హక్, షాహిద్ అఫ్రిదీలు ఉన్నారు.

బ్రియాన్ లారా

బ్రియాన్ లారా

వెస్టిండిస్ నుంచి బ్రియాన్ లారా, చంద్రపాల్ ఐదుసార్లు వరల్డ్‌కప్‌కు ప్రాతినిథ్యం వహించారు.

స్టీవ్ టికోలో

స్టీవ్ టికోలో

కెన్యా నుంచి స్టీవ్ టికోలో, థామస్ ఒడోయో ఐదు సార్లు వరల్డ్‌కప్‌కు ప్రాతినిథ్యం వహించారు.

రికీ పాంటింగ్

రికీ పాంటింగ్

దక్షిణాఫ్రికా నుంచి జాక్వస్ కల్లిస్.... ఆస్ట్రేలియా నుంచి రికీ పాంటింగ్, న్యూజిలాండ్ నుంచి డానియల్ వెటోరిలు ఐదు సార్లు వరల్డ్‌కప్‌కు ప్రాతినిథ్యం వహించారు.

Story first published: Tuesday, February 26, 2019, 17:54 [IST]
Other articles published on Feb 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X