న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పరాజయం కేవలం ఆటగాళ్ల వల్ల జరిగిందే'

India vs Westindies 2018 : Jason Holder Talks About The Match
Players responsible for this difficult loss: Jason Holder

న్యూఢిల్లీ: భారత్ చేతిలో చిత్తుగా 10 వికెట్ల తేడాతో ఓడటం తనని బాధిస్తోందని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన ఆ జట్టు భారత్ చేతిలో ఓడి సిరీస్‌ని 0-2తో చేజార్చుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఆరంభానికి ముందే భారత్‌కు గట్టిపోటీ ఇవ్వాలని భావించిన వెస్టిండీస్‌కు నిరాశ తప్పలేదు.

మరీ.. ఇంత గందరగోళానికి గురి చేస్తాడనుకోలేదు: కోహ్లీమరీ.. ఇంత గందరగోళానికి గురి చేస్తాడనుకోలేదు: కోహ్లీ

2 టెస్టులూ 3 రోజుల్లోనే ముగిసి

2 టెస్టులూ 3 రోజుల్లోనే ముగిసి

ముఖ్యంగా.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులతో ఫర్వాలేదనిపించిన వెస్టిండీస్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మరీ పేలవంగా 127 పరుగులకే కుప్పకూలిపోయింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులు చేసిన భారత్ జట్టు.. లక్ష్యాన్ని కేవలం 16.1 ఓవర్లలోనే 75/0తో అలవోకగా ఛేదించేసింది. దీంతో.. సిరీస్‌లోని రెండు టెస్టులూ మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి.

 ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం

ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం

‘నిజాయతీగా చెప్పాలంటే.. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. అయితే.. జట్టు ఇలా ఎందుకు విఫలమైందో..? అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నా. ఈ ఓటములకి ఆటగాళ్లే పూర్తి బాధ్యత వహించాలి. వెస్టిండీస్ జట్టుకి ఇది చాలా కఠినమైన సిరీస్.. మేము కూడా అత్యుత్తమంగా ఆడలేకపోయాం.'

రోస్టన్ చేజ్ సెంచరీ బాదడం సానుకూలాంశం

రోస్టన్ చేజ్ సెంచరీ బాదడం సానుకూలాంశం

'మరోవైపు భారత్ జట్టు ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. దీనికి తోడు.. సొంతగడ్డపై ఆడుతోంది. అయినప్పటికీ.. మా జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రోస్టన్ చేజ్ సెంచరీ బాదడం సానుకూలాంశం'అని జేసన్ హోల్డర్ చెప్పుకొచ్చాడు.

10 వికెట్లు తీసి ఔట్‌ స్టాండింగ్‌ ప్రదర్శన

10 వికెట్లు తీసి ఔట్‌ స్టాండింగ్‌ ప్రదర్శన

ఈ విజయం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు విజయంలో సహచర ఆటగాళ్ల తోడ్పాటు విజయాన్ని తెచ్చిపెట్టిందని కొనియాడాడు. బౌలర్ ఉమేశ్ యాదవ్ ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు. అతడిది ఔట్‌ స్టాండింగ్‌ ప్రదర్శన అంటూ అభినందించాడు. 10 వికెట్లు తీసి ఔట్‌ స్టాండింగ్‌ ప్రదర్శన చేశాడు. శార్దూల్‌ గాయం బారిన పడటంతో కాస్త ఆయోమయంలో పడ్డ మాకు ఉమేశ్ రూపంలో ఊరట లభించిందని కొనియాడాడు.

Story first published: Monday, October 15, 2018, 14:14 [IST]
Other articles published on Oct 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X