న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Zimbabwe : రెండో వన్డేకు ముందు ప్లేయర్లను ఊరిస్తున్న మైలురాళ్లు

Players Reaching Some Milestones Ahead of Second ODI Between India and Zimbabwe

జింబాబ్వే వర్సెస్ భారత్ మధ్య 2వ వన్డేకు ముందు కొన్ని రికార్డులు ప్లేయర్లను ఊరిస్తున్నాయి. జింబాబ్వే వర్సెస్ భారత్ మధ్య ఇప్పటివరకు 64 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అందులో జింబాబ్వే 10 మ్యాచ్‌లలో గెలవగా.. భారత్ 52 మ్యాచ్‌లు గెలుపొందింది. రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. జింబాబ్వేలో ఇరు జట్లు 24మ్యాచ్‌ల్లో తలపడగా.. ఆతిథ్య జట్టు కేవలం నాలుగుసార్లు మాత్రమే గెలవగా.. ఇండియా 20సార్లు గెలుపొందింది.

ఈ మైలురాళ్లకు చేరువగా జింబాబ్వే ప్లేయర్లు

ఈ మైలురాళ్లకు చేరువగా జింబాబ్వే ప్లేయర్లు

జింబాబ్వే కెప్టెన్ రెగిస్ చకబ్వా వన్డేల్లో 50 క్యాచ్‌లు పూర్తి చేయడానికి ఒక క్యాచ్ దూరంలో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 250ఫోర్ల మార్క్ చేరుకోవడానికి మరో పది ఫోర్లు చకబ్వా కొట్టాలి. జింబాబ్వే స్టార్ ప్లేయర్ సికందర్ రజా వన్డే క్రికెట్‌లో 3500పరుగుల మార్క్ చేరుకోవడానికి మరో ఐదు పరుగులు చేయాలి.

అన్ని ఫార్మాట్‌లలో కలిపి 500ఫోర్ల మార్క్ చేరుకోవడానికి మరో పది ఫోర్లు బాదాలి. వన్డే ఇంటర్నేషనల్స్‌లో 50క్యాచ్‌లను చేరుకోవడానికి మరో రెండు క్యాచ్‌లు పట్టాలి. జింబాబ్వే స్టార్ ర్యాన్ బర్ల్ వన్డేలలో 500పరుగులు పూర్తి చేయడానికి మరో 53పరుగులు చేయాలి. రిచర్డ్ ఎంగరవ అంతర్జాతీయ క్రికెట్‌లో తన 50వ మ్యాచ్ ఆడబోతున్నాడు.

ఈ మార్క్‌లకు చేరువగా భారత ప్లేయర్లు

ఈ మార్క్‌లకు చేరువగా భారత ప్లేయర్లు

ఇంటర్నేషనల్ క్రికెట్లో కేఎల్ రాహుల్ 600ఫోర్ల మార్క్ చేరుకోవడానికి మరో రెండు ఫోర్లు బాదాలి. కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌తో తన 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగులు చేయడానికి శుభ్‌మన్ గిల్ (915పరుగులు)కు మరో 85పరుగులు అవసరం. ఇకపోతే రాహుల్ మరియు శుభ్ మన్ గిల్‌లలో రేపటి మ్యాచ్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది ఉత్కంఠగా మారింది. జింబాబ్వే‌పై ధావన్, గిల్ బరిలోకి దిగి పూర్తిగా ఆడితే కేఎల్ రాహుల్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ దక్కకపోవచ్చు.

తొలి మ్యాచులో ఓపెనర్లే దంచేశారు

తొలి మ్యాచులో ఓపెనర్లే దంచేశారు

ఇకపోతే తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 40.3ఓవర్లకు 189పరుగులకే ఆలౌట్ కాగా.. తర్వాత ధావన్ (81పరుగులు), శుభ్‌మన్ గిల్ (82పరుగులు) ఇద్దరే 30.5ఓవర్లలోనే లక్ష్యాన్ని అలవోకగా ఊది పడేశారు. తద్వారా 10వికెట్ల భారీ తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలో తొలిసారి భారత్ వన్డే గెలుపొందింది. తద్వారా సిరీస్లో భారత్ 1-0తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో 3 టాపార్డర్ వికెట్లు తీసిన దీపక్ చాహర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Story first published: Friday, August 19, 2022, 18:09 [IST]
Other articles published on Aug 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X