న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PinkBall Test: ఆ సమయంలో ఇషాంత్‌ శర్మను త‌న్ని లేపాల్సి వ‌చ్చింది: కోహ్లీ

PinkBall Test: Virat Kohli recalls Ishant Sharmas Maiden India Call-Up
Ind vs Eng 2021,3rd Test : Virat Kohli Recalls Ishant Sharma's Maiden India Call Up

అహ్మ‌దాబాద్‌: టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్‌ శర్మ 100వ టెస్టు మ్యాచ్‌ ఆడబోతున్న విషయం తెలిసిందే. బుధ‌వారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కాబోయే టెస్ట్ ఇషాంత్ కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్‌. భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ (131 టెస్టులు) తర్వాత వంద మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌గా ఇషాంత్ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ఈ సంద‌ర్భంగా ఇషాంత్‌తో త‌న‌కున్న స్నేహాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షేర్ చేసుకున్నాడు. లంబూ తొలిసారి భారత జట్టుకు ఎంపికైన సంద‌ర్భాన్ని కోహ్లీ గుర్తు చేశాడు.

'ఇషాంత్ శర్మ స్టేట్ క్రికెట్‌ను నాతో క‌లిసి ఆడ‌టం ప్రారంభించాడు. స్టేట్ క్రికెట్‌, రంజీ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం మేమిద్దరం రూమ్ మేట్స్‌. మంచి స్నేహితులం. ఇషాంత్ తొలిసారి భారత జట్టుకు ఎంపికైన‌ప్పుడు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో గుర‌కపెట్టి ప‌డుకున్నాడు. అప్పుడు నేను తన పక్కనే ఉన్నాను. ఈ గుడ్ న్యూస్ చెప్ప‌డానికి అత‌న్ని నేను త‌న్ని లేపాను. ఇద్ద‌రం అంత క్లోజ్‌గా ఉండేవాళ్లం. పరస్పర నమ్మకం కలిగి ఉండేవాళ్లం' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

'ఇన్నేళ్లుగా బౌలింగ్‌ను ఎంజాయ్‌ చేస్తూ టెస్టు క్రికెట్‌ ఆడుతున్న ఇషాంత్‌ శర్మ వందో టెస్టు ఆడనుండటం సంతోషంగా ఉంది. ఆధునిక క్రికెట్‌లో ఇదో గొప్ప ఘ‌న‌త . 100 టెస్టుల వ‌ర‌కూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవ‌డం అంత సులువు కాదు. పేస్ బౌల‌ర్ల‌లో ఇది చాలా అరుదు. నిజానికి లంబూ వన్డేల‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా.. టెస్ట్ క్రికెట్ పైనే పూర్తిగా దృష్టి సారించాడు. మరికొన్నేళ్ల పాటు అతడు టెస్టు క్రికెట్‌ ఆడుతూనే ఉండాలి' అని విరాట్ కోహ్లీ కోరుకున్నాడు. ఇషాంత్ టీమిండియా తరఫున 2016లో చివరి వన్డే, 2013లో ఆఖరిసారిగా టీ20 మ్యాచ్‌ ఆడాడు.

ఓ పేసర్‌ గాయాలను అధిగమించి వంద టెస్టులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచ క్రికెట్లో అతికొద్ది మంది మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. టీమిండియా తరఫున మాజీ పేసర్ కపిల్‌దేవ్‌ (131) వంద టెస్టులు ఆడాడు. ఆ తర్వాత ఎందరో పేసర్లు భారత జట్టులోకి వచ్చినా.. వారెవరూ ఈ మార్క్‌ చేరుకోలేకపోయారు. సుదీర్ఘ కాలం టీమిండియాకు ఆడిన జహీర్‌ ఖాన్‌ (92) కూడా సెంచరీ కొట్టలేకపోయాడు. అయితే ఆ ఘనత ఇప్పుడు సీనియర్ పేసర్ ఇషాంత్‌ శర్మను వరించనుంది. 99 టెస్టులు.. 302 వికెట్లు.. 32.22 సగటు ఇదీ ఇషాంత్‌ టెస్ట్ ప్రదర్శన.

ఫించ్.. నువ్వు ఆస్ట్రేలియా కెప్టెన్‌వి! ఐపీఎల్‌ విషయంలో అలా చెప్పడం సరికాదు: మైఖెల్‌ క్లార్క్‌ఫించ్.. నువ్వు ఆస్ట్రేలియా కెప్టెన్‌వి! ఐపీఎల్‌ విషయంలో అలా చెప్పడం సరికాదు: మైఖెల్‌ క్లార్క్‌

Story first published: Tuesday, February 23, 2021, 17:58 [IST]
Other articles published on Feb 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X