న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్ట్ క్రికెట్‌ను పునరుద్ధరించడానికి పింక్ బాల్ సరిపోదు: రాహుల్ ద్రవిడ్

India Vs Bangladesh, Day-Night Test : Rahul Dravid Says Pink Ball Not Enough To Revamp Test Cricket
Pink Ball not enough to revamp Test Cricket, need to improve overall experience of fans: Rahul Dravid

హైదరాబాద్: టెస్టు క్రికెట్‌‌కు ఆదరణ పొందేందుకు డే/నైట్ టెస్టు ఒక్కటే పరిష్కారం కాదని మాజీ క్రికెట్ దిగ్గజం, జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. డే/నైట్‌ టెస్టులను వీక్షించడానికి మైదానానికి వచ్చే ప్రేక్షకులకు కనీస సౌకర్యాల్ని మెరుగుపరచాల్సిన అవసరం కూడా ఎంతో ముఖ్యమని తెలిపాడు.

నవంబర్ 22న ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-బంగ్లాల మధ్య తొలి డే/నైట్‌ టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ మాట్లాడుతూ "టెస్టు క్రికెట్‌‌ను బతికించడానికి డే/నైట్‌ టెస్టులొక్కటే పరిష్కారం కాదు. పింక్ బాల్ టెస్టు అనేది అభిమానులను ఆకర్షించేందుకు చేసే ఓ వినూత్న ప్రయత్నం. మంచును నియంత్రించగలిగితే గులాబి బంతి టెస్టును భారత్‌లో ప్రతి ఏడాదీ ఆడొచ్చు" అని అన్నాడు.

సంధ్య వెలుగులో పింక్ బాల్‌: డే నైట్ టెస్టులో అంపైర్లు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇదే!సంధ్య వెలుగులో పింక్ బాల్‌: డే నైట్ టెస్టులో అంపైర్లు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇదే!

టెస్టు క్రికెట్‌ను చూసేందుకు ఎందుకు రావడం లేదు

టెస్టు క్రికెట్‌ను చూసేందుకు ఎందుకు రావడం లేదు

"చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. అసలు అభిమానులు టెస్టు క్రికెట్‌ను చూసేందుకు ఎందుకు రావడం లేదనే ఆలోచనతో పాటు స్టేడియాల్లో సౌకర్యాలపై కూడా దృష్టి సారించాలి. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీరు, మంచి సీట్లు, కార్లకు పార్కింగ్‌ సమస్య లేకుండా ఏర్పాట్లు మెరుగ్గా ఉండాలి. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సందర్భంగా పుణెలో ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి" అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

2001లో ఈడెన్‌లో మ్యాచ్‌ను లక్ష మంది చూశారని

2001లో ఈడెన్‌లో మ్యాచ్‌ను లక్ష మంది చూశారని

"2001లో ఈడెన్‌లో మ్యాచ్‌ను లక్ష మంది చూశారని చెప్పేవాళ్లం. కానీ మనం ఓ విషయం గుర్తుంచుకోవాలి. అప్పట్లో హెచ్‌డీ టీవీలు, మొబైల్‌లో క్రికెట్‌ చూసుకునే సౌకర్యం లేవు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయనే విషయం గుర్తుంచుకోవాలి. వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. అలాగే కచ్చితమైన టెస్టు క్యాలెండర్‌ను అమలు చేయాలి" అని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.

యాషెస్‌ సిరీస్‌కు మైదానాలు నిండుతున్నాయి కదా!

యాషెస్‌ సిరీస్‌కు మైదానాలు నిండుతున్నాయి కదా!

"యాషెస్‌ సిరీస్‌కు మైదానాలు నిండుతున్నాయి కదా అని మీరు అనొచ్చు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలకు టెస్టు క్యాలెండర్‌ ఉండడమే ఆ దేశంలో టెస్టు క్రికెట్‌ మెరుగైన స్థితిలో ఉండడానికి కారణం. బాక్సింగ్‌ డే టెస్టు, కచ్చితంగా జూలైలో లార్డ్స్‌ టెస్టు ఇలాంటివన్నీ పక్కా ప్రణాళికతో జరిగేవి. భారత్‌లో కూడా కచ్చితమైన టెస్టు క్యాలెండర్‌ను జతచేస్తే ప్రయోజనం ఉంటుంది" అని ద్రవిడ్ అన్నాడు.

Story first published: Wednesday, November 20, 2019, 11:17 [IST]
Other articles published on Nov 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X