న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాల్లో డైవ్‌ కొట్టి ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టిన కామెరాన్‌ .. షాక్‌కు గురైన బ్యాట్స్‌మన్‌(వీడియో)

Peter Handscomb Dismissed By Cameron Valentes One-handed catch In Marsh Cup

మెల్‌బోర్న్‌: క్రికెట్ ఆటలో క్యాచ్‌లు సర్వసాధారణం. గతంలో ఫీల్డర్లు తమ దగ్గరకు వచ్చిన క్యాచ్‌లను కూడా వదిలేవారు. కానీ.. ఇప్పుడలా లేదు. కొందరు ఫీల్డర్లు బౌండరీ లైన్ దాటుతున్న బంతులను కూడా క్యాచ్‌ పట్టి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేస్తున్నారు. మరికొందరు దూరంగా వెళ్తున్న బంతులను కూడా గాల్లో డైవ్‌ కొట్టి మరి అందుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి క్యాచ్‌నే తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్‌ వాలెంటే అందుకున్నాడు.

మయాంక్‌కు అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది: గావస్కర్‌మయాంక్‌కు అసలు పరీక్ష అప్పుడే మొదలవుతుంది: గావస్కర్‌

కామెరాన్‌ సూపర్‌మ్యాన్‌ క్యాచ్:

కామెరాన్‌ సూపర్‌మ్యాన్‌ క్యాచ్:

మార్ష్‌ వన్డే కప్‌లో భాగంగా విక్టోరియా-సౌత్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సౌత్‌ ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న కామెరాన్‌ ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టి ఈ మ్యాచ్‌లో అద్భుతం చేసాడు. విక్టోరియా ఇన్నింగ్స్‌లో భాగంగా 28 ఓవర్‌ను పేసర్ కేన్‌ రిచర్డ్‌సన్‌ వేశాడు. ఆ ఓవర్‌ ఐదో బంతిని హ్యాండ్‌స్కాంబ్‌ మిడ్‌ఆఫ్‌-ఎక్స్‌ ట్రా కవర్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. బంతి పైకి లేవగా.. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న కామెరాన్‌ పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లో డైవ్‌ కొట్టి ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో ఒక్కసారిగా హ్యాండ్‌స్కాంబ్‌ షాకయ్యాడు.

వాట్ ఏ క్యాచ్:

ఈ క్యాచ్‌కు సంబందించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు 25 ఏళ్ల కామెరాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'సూపర్‌ మ్యాన్‌లా' పట్టాడు అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'వావ్ వాట్ ఏ క్యాచ్' అని మరో అభిమాని కామెంట్ చేసాడు.

 ఫెర్గూసన్ సెంచరీ:

ఫెర్గూసన్ సెంచరీ:

ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా కేవలం ఒక్క పరుగు తేడాతో గెలిచింది. మొదటగా బ్యాటింగ్ చేసిన సౌత్‌ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. కల్లమ్ ఫెర్గూసన్ (122) సెంచరీ చేయగా.. టామ్ కూపర్ (81) అర్ధ సెంచరీ చేసాడు.

ఒక్క పరుగు తేడాతో ఓటమి:

ఒక్క పరుగు తేడాతో ఓటమి:

లక్ష్య ఛేదనలో విక్టోరియా ఐదు వికెట్ల నష్టానికి 321 పరుగులే చేసి ఓటమి పాలైంది. విక్టోరియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ (113) మంచి ఆరంభాన్నిచ్చాడు. మూడో వికెట్‌కు హ్యాండ్‌స్కాంబ్‌తో కలిసి 147 పరుగులు జోడించాడు. దీంతో విక్టోరియా గెలుస్తుందనే అనుకున్నారంతా. అయితే హ్యాండ్‌స్కాంబ్‌ (87) క్యాచ్‌ను కామెరాన్‌ పట్టడం విక్టోరియా కొంపముచ్చింది. హ్యాండ్‌స్కాంబ్‌ ఔట్ అనంతరం విక్టోరియా పోరాడినా ఫలితం లేకపోయింది.

Story first published: Tuesday, November 19, 2019, 16:35 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X