న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజీలాండ్ బ్యాటింగ్ కోచ్‌గా 'పీటర్ ఫుల్టన్'

Peter Fulton to replace McMillan as New Zealands batting coach after World Cup

న్యూజీలాండ్ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్‌గా ఆ దేశ మాజీ బ్యాట్స్‌మన్‌ పీటర్ ఫుల్టన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజీలాండ్ జట్టుకు ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న మెక్ మిలాన్ ప్రపంచకప్‌ అనంతరం తన బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. మెక్ మిలాన్ దాదాపు ఐదు సంవత్సరాలు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు.

ప్రపంచకప్‌ అనంతరం బాధ్యతలు:

ప్రపంచకప్‌ అనంతరం బాధ్యతలు:

ప్రపంచకప్‌ అనంతరం మెక్ మిలాన్ బాధ్యతలను పీటర్ ఫుల్టన్ తీసుకోనున్నారు. జులై 3న న్యూజీలాండ్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ జట్టుతో ఆడనుంది. ఇక టోర్నీ ఫైనల్ మాత్రం జులై 14న జరగనుంది. ప్రపంచకప్‌ అనంతరం ఫుల్టన్ బాధ్యతలు చేపట్టనున్నా.. అధికారికంగా మాత్రం జులై 1నే పదవిలోకి రానున్నారు.

కివీస్ అండర్-19 జట్టుకు కోచ్‌:

కివీస్ అండర్-19 జట్టుకు కోచ్‌:

న్యూజీలాండ్ తరపున 2006 నుండి 2014 వరకు పీటర్ ఫుల్టన్ 84 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 23 టెస్ట్ మ్యాచ్‌లు, 49 వన్డే మ్యాచ్‌లు, 12 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. మూడు ఫార్మాట్ లలో కలిపి 2428 పరుగులు (మూడు సెంచరీలు) చేసాడు. జూన్ 2014లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు. 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు ఫుల్టన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం న్యూజీలాండ్ అండర్-19 జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.

ఇప్పటికే నిరూపించున్నాడు:

ఇప్పటికే నిరూపించున్నాడు:

'న్యూజీలాండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికవడం చాలా ప్రత్యేకం. జట్టులో చాలా మంది మంచి బ్యాట్స్‌మన్‌ ఉన్నారు. వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. వారు మరింత మెరుగ్గా రాణించడానికి నా వంతు కృషి చేస్తాను' అని ఫుల్టన్ తెలిపారు. 'ప్రపంచకప్‌ అనంతరం ఫుల్టన్ బాధ్యతలు చేపట్టనున్నారు. అతని సామర్థ్యంపై నమ్మకం ఉంది. అతను మా జట్టులో ఇమడగలడు. ఫుల్టన్ మంచి నైపుణ్యం ఉన్న బ్యాట్స్‌మన్‌, మా బ్యాట్స్‌మన్‌కు మంచి సలహాలు ఇస్తాడు. న్యూజీలాండ్ అండర్-19 జట్టుకు కోచ్‌గా ఇప్పటికే నిరూపించున్నాడు' అని కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ పేర్కొన్నారు.

Story first published: Wednesday, May 15, 2019, 14:33 [IST]
Other articles published on May 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X