న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ramiz Raja: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ అసాధ్యం!

PCB chairman Ramiz Raja on revival of bilateral cricket between India and Pakistan

కరాచీ: పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) కొత్త ఛైర్మన్​గా ఆ దేశ మాజీ క్రికెటర్​ రమీజ్​ రాజా ఎన్నికయ్యాడు. ఆ బాధ్యతలు స్వీకరించిన వెంటనే టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్​ అవకాశాలపై స్పందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ సాధ్యం కాదని.. అయినా దానికేమి అంత తొందర లేదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తమ దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపాడు. పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు అధ్యక్ష పదవి ఎన్నికలో ప్రధాని మంత్రి, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అండదండలతో రమీజ్ రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం రమీజ్ రాజా మీడియాతో మాట్లాడారు.

ఇప్పుడు కుదరదు..

ఇప్పుడు కుదరదు..

'పీసీబీ అధ్యక్ష పదవి చాలా పెద్ద సవాలుతో కూడుకున్నది. ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్ నాకు ఈ కఠినమైన ఉద్యోగాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు'అని చెప్పగా.. పాకిస్థాన్​, భారత్​ మధ్య ద్వైపాక్షిక సిరీస్​ ఎప్పుడు జరుగుతుందని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దానికి సమాధానమిస్తూ..'ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అది అసాధ్యం. ఎందుకంటే రాజకీయాలపై ఇప్పుడు క్రీడాటోర్నీ నిర్వహణ ఆధారపడి ఉంది. అయితే భారత్​తో ద్వైపాక్షిక సిరీస్​ కోసం మాకు అంత తొందరేమి లేదు. ప్రస్తుతం పాక్​ దేశవాళీ క్రికెట్​ను అభివృద్ధిగా దిశగా తీసుకెళ్లడం మా ముందున్న కర్తవ్యం" అని రమీజ్​రాజా స్పష్టం చేశాడు.

ఏకగ్రీవంగా ఎన్నిక

ఏకగ్రీవంగా ఎన్నిక

పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు అధ్యక్ష పదవి ఎన్నికలో రమీజ్ రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే గతంలో పీసీబీ అధ్యక్షుడిగా వ్యవహరించిన హెసన్​ మణి పదవీకాలం పూర్తవ్వడంతో కొత్త చైర్మన్‌గా రమీజ్ రాజా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే తాత్కాలిక కోచ్​లుగా నియమితులైన సక్లెయిన్​ ముస్తాక్​, అబ్దుల్​ రజాక్​లూ కూడా ఈ మీటింగ్​కు హాజరయ్యారు. బాధ్యతలు చేపట్టిన నిమిషాల వ్యవధిలోనే రమీజ్ రాజా.. తన మార్క్ చూపించాడు. పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్, సౌతాఫ్రికా మాజీ బౌలర్ వెర్నాన్ ఫిలాండర్‌ను బౌలింగ్‌ కోచ్ నియమిస్తున్నట్లు ప్రకటించారు.

255 మ్యాచ్‌లు..

255 మ్యాచ్‌లు..

క్రికెటర్​గా..రమీజ్​ రాజా.. పాకిస్థాన్​ టెస్టు క్రికెట్​ జట్టుకు 18వ కెప్టెన్​గా.. వన్డే టీమ్​కు 12వ సారథిగా వ్యవహరించాడు. క్రికెట్​ కెరీర్​ 1984 నుంచి 1997 మధ్యలో 255 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన రమీజ్​ రాజా.. 8,674 పరుగులను నమోదు చేశాడు. గతంలో పాక్​ బోర్డుకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కామెంటేటర్‌గా రమీజ్ రాజాకు మంచి గుర్తింపు ఉంది. మొన్నటి వరకు అతను తన యూట్యూబ్ చానెల్‌లో భారత క్రికెట్‌కు సంబంధించిన అనేక విషయాలను విశ్లేషించాడు.

Story first published: Monday, September 13, 2021, 22:08 [IST]
Other articles published on Sep 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X