న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs RCB:ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు డకౌట్‌లు.. ఇంకా అవసరమా ఆడడం!ఇంకెందుకు ఆలస్యం ఇంటికి పంపించేయండి!

PBKS vs RCB: Nicholas Pooran gets another Duck in IPL 2021, Twitterati trolls him

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ హార్డ్ హిట్టర్ నికోలస్‌ పూరన్‌ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటికే మూడుసార్లు డకౌట్‌లు అయిన పూరన్‌.. మరోసారి సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పూరన్‌ డకౌట్‌గా మరోసారి వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో పేసర్ కైల్ జేమిసన్‌ బౌలింగ్‌లో పూరన్‌ డకౌట్‌ అయ్యాడు.

PBKS vs RCB:కేఎల్ రాహుల్ మెరుపులు.. క్రిస్‌ గేల్‌ విధ్వంసం!బెంగళూరుకు భారీ లక్ష్యం!ఫిఫ్టీ కొట్టిన హర్షల్ పటేల్PBKS vs RCB:కేఎల్ రాహుల్ మెరుపులు.. క్రిస్‌ గేల్‌ విధ్వంసం!బెంగళూరుకు భారీ లక్ష్యం!ఫిఫ్టీ కొట్టిన హర్షల్ పటేల్

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో నికోలస్‌ పూరన్‌ డకౌట్ల సంఖ్య నాలుగు చేరింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు డకౌట్‌ అయి అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక సార్లు డకౌట్‌ అయిన ఆటగాడిగా నిలిచిన పూరన్‌.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇంతకుముందు హర్షల్ గిబ్స్‌ (2009), మిథున్‌ మన్హాస్‌ (2011), మనీష్‌ పాండే (2012), శిఖర్‌ ధావన్‌ (2020)లు నాలుగు సార్లు డకౌట్‌ అయ్యారు. తాజాగా ఆ లిస్టులో పూరన్‌ కూడా చేరిపోయాడు.

నికోలస్‌ పూరన్‌ ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా 0,0, 9,0,19,0 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2021లో పూరన్‌ చేసిన మొత్తం స్కోర్ 28. ఇంత దారుణంగా విఫలమవుతున్న పూరన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ తుది జట్టులో ఎందుకు చోటు కల్పిస్తుందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. 'ఇప్పటికైనా పంజాబ్‌ కళ్లు తెరిచి పూరన్‌ స్థానంలో మలాన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి', 'పూరన్‌ ఇంకా నువ్ అవసరమా ఆడడం', 'ఇంకెందుకు ఆలస్యం ఇంటికి పంపించేయండి' అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసి.. బెంగళూరు ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (91; 57 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులు) భారీ హాఫ్ సెంచరీ చేయగా.. యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ (46; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) విధ్వంసం సృష్టించాడు. ఇక ఇన్నింగ్స్ చివరలో హర్‌ప్రీత్‌ బార్‌ 17 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ఇక పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక వికెట్ కూడా తీయకుండా.. ఏకంగా 53 రన్స్ ఇచ్చుకున్నాడు.

Story first published: Friday, April 30, 2021, 22:48 [IST]
Other articles published on Apr 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X